Vehicle Ownership Transfer : రవాణా శాఖ సేవలు మరింత ఈజీ - ఆన్‌లైన్‌లోనే ఓనర్​షిప్ ట్రాన్స్‌ఫర్, NOC..!

Vehicle Ownership Transfer : రవాణా శాఖ కీలక సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది. వాహన యాజమాన్య బదిలీ, ఎన్‌ఓసీ, ఈ-కేవైసీ వివరాల అప్‌డేట్‌ను ఇకపై వాహన్ పోర్టల్ ద్వారా నేరుగా చేసుకోవచ్చు.

Published on: Nov 8, 2026, 11:30:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Vehicle Ownership Transfer :వాహనదారులకు శ్రమ, సమయం ఆదా చేసేలా రవాణా శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. వాహన యాజమాన్య బదిలీ, ఇతర రాష్ట్రాలకు వాహనాన్ని తరలించడానికి అవసరమైన నిరభ్యంతర పత్రం, అలాగే యజమాని ఈ-కేవైసీ వివరాల అప్‌డేట్... ఈ మూడు కీలక సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రవాణా శాఖ శనివారం వెల్లడించింది.

ఇకపై ఆన్‌లైన్‌లోనే ఓనర్ షిప్ ట్రాన్స్‌ఫర్ (Image Pixel)
ఇకపై ఆన్‌లైన్‌లోనే ఓనర్ షిప్ ట్రాన్స్‌ఫర్ (Image Pixel)

ఇకపై రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అధికారిక 'వాహన్‌ సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్' ద్వారా ఆధార్‌ ఓటీపీ ధ్రువీకరణతో ఈ సేవలను అత్యంత సులభంగా పొందవచ్చని అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించాలని…. వివరాలు నమోదు చేసే సమయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు.

ముఖ్యంగా ఆధార్‌ ఓటీపీని ఎవరితోనూ పంచుకోవద్దని భద్రతా హెచ్చరికలు జారీ చేశారు. దీనికితోడు, సదరు వాహనంపై ఏమైనా నేర సంబంధిత రికార్డులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని జాతీయ నేర రికార్డుల విభాగం డేటాబేస్ ద్వారా తనిఖీ చేసుకునే వెసులుబాటు కూడా ఈ వ్యవస్థలో ఉందని వివరించారు.

ప్రాసెస్ ఇలా….

  • వాహనాన్ని వేరొకరికి విక్రయించినప్పుడు యాజమాన్య బదిలీని పూర్తి చేయడానికి విక్రయదారు…. కొనుగోలుదారు ఇద్దరూ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఇద్దరూ తమ ఆధార్‌ సంఖ్యతో వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి గుర్తింపును ధ్రువీకరించాలి. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో నిర్ణీత రుసుము (ఫీజు) చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • అధికారులు సమర్పించిన వివరాలన్నింటినీ పరిశీలించి ఆమోదం తెలిపాక, ఆర్టీఓ కార్యాలయం నుంచి కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) జారీ అవుతుంది.
  • దీంతోపాటు వాహన్ పోర్టల్‌లో కొత్త యజమాని వివరాలు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి.

ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాన్ని మరొక రాష్ట్రానికి శాశ్వతంగా తరలించాలనుకునే వారు కూడా ఎన్‌ఓసీ కోసం ఆర్టీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన పనిలేకుండా ఆన్‌లైన్ విధానాన్ని తెచ్చారు. వాహన రిజిస్ట్రేషన్ వివరాలు, యజమాని సమాచారంతో పాటు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ పరిశీలన పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ ద్వారానే డిజిటల్ ఎన్‌ఓసీ పొందవచ్చు.

వాహన యజమానుల గుర్తింపు వివరాలను డిజిటల్ పద్ధతిలో ధ్రువీకరించడానికి ఈ-కేవైసీ సేవలను ప్రవేశపెట్టారు. యజమానులు వాహన్ పోర్టల్‌లో తమ వాహన రిజిస్ట్రేషన్ నంబరు, ఛాసిస్ నంబరు నమోదు చేసి, ఆధార్ ఓటీపీ ద్వారా ధ్రువీకరణను క్షణాల్లో పూర్తి చేసుకోవచ్చు. కేవైసీలో వివరాలు ఒకసారి సబ్మిట్ చేశాక మార్పులు చేయడానికి వీలుండదని రవాణశాఖ స్పష్టం చేసింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More