...
...
Next Story

మహిళా న్యాయవాది హత్య కేసులో ట్విస్ట్.. సుపారీ గ్యాంగ్‌తో చెల్లెను హత్య చేయించిన అన్న

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ లో దారుణం చోటు చేసుకుంది. మహిళా న్యాయవాది స్వప్న హత్యకు గురయ్యారు. సోదరుడే ఈ హత్య చేయించాడు.

Published on: Feb 04, 2026 12:10 PM IST
Advertisement

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో ఆస్తి వివాదంలో 34 ఏళ్ల మహిళా న్యాయవాదిని ఆమె సోదరుడు హత్య చేయించాడు. గ్యాంగ్‌తో చెల్లెలు స్వప్నను చంపించాడు అన్న. ఈ హత్యపై న్యాయవాదులు నిరసన తెలిపారు. వెంటనే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిని దిగ్బంధించారు.

మహిళా న్యాయవాది దారుణహత్య (representative image )
మహిళా న్యాయవాది దారుణహత్య (representative image )

కుటుంబ ఆస్తి వివాదంలో మహిళా న్యాయవాదిని ఆమె సొంత అన్న హత్య చేయించాడు. బాధితురాలు స్వప్న చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాది. పోలీసుల దర్యాప్తు ప్రకారం, ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న ఆస్తి వివాదాన్ని పరిష్కరించడానికి పంచాయితీ జరుగుతున్న వ్యవసాయ భూమికి స్వప్న వెళ్లింది.

ఉదయం పొలానికి వెళ్లిన సమయంలో స్వప్నను ముసుగులు ధరించి కారులో వచ్చి కత్తితో పొడిచి చంపి పారిపోయారు. సుపారీ గ్యాంగ్‌కు స్వప్న అన్న డబ్బులిచ్చి ఈ దారుణం చేయించాడు. ఆమె తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ సంఘటన తర్వాత సుపారీ గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోయింది. వారి కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు స్వప్న సోదరుడి జాడ కూడా తెలుసుకుని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

ఈ దారుణ హత్యపై న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. నిరసనగా చేవెళ్ల, సమీపంలోని ఇతర కోర్టులలో కోర్టు కార్యకలాపాలను బహిష్కరించారు. నిందితులను త్వరగా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో న్యాయవాదులు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe