...
...
Next Story

పెండింగ్ స్కాలర్‌షిప్ బకాయిలు - రూ. 161 కోట్ల విడుదలకు ఆదేశాలు

పెండింగ్ స్కాలర్‌షిప్ బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2813 జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన రూ. 161 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి భట్టి ఆదేశాలు జారీ చేశారు.

Published on: Nov 20, 2025, 19:44:33 IST
Advertisement

రాష్ట్రంలోని పలు కాలేజీలు పెండింగ్ స్కాలర్ షిప్ బకాయిల కోసం పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలనే బంద్ కు కూడా పిలుపునివ్వగా… ప్రభుత్వం చర్చలు జరిపింది. దీంతో ఆయా కాలేజీలు వెనక్కి తగ్గాయి. చర్చల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పెండింగ్ స్కాలర్ షిప్ బకాయిలు
పెండింగ్ స్కాలర్ షిప్ బకాయిలు

2813 జూనియర్, డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన పెండింగ్ స్కాలర్‌షిప్ బకాయిలు రూ. 161 కోట్లు వెంటనే విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలను జారీ చేశారు. ఆయా నిధులను వెంటనే విడుదల చేయాలని సూచించారు.

నిరంతరాయంగా నిధులు - డిప్యూటీ సీఎం భట్టి

గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓ ప్రకటన ద్వారా తెలిపారు. విద్యార్థులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా, కళాశాలలకు అవసరమైన నిధులు నిరంతరాయంగా చేరేలా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

కొద్దిరోజుల కిందట ఫీజు బకాయిలపై తెలంగాణలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు బంద్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే నవంబర్ మొదటి వారంలో ప్రభుత్వం… కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలో ఈ చర్చలు నిర్వహించారు. కాలేజీలతో జరిపిన చర్చలు సఫలం కావటంతో…. నవంబర్ 8వ తేదీ నుంచి కాలేజీలు తెరుచుకున్నాయి.

మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారంపై ప్రభుత్వం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. యాజమాన్యాల ప్రతినిధులతో కలిసి అవసరమైన సంస్కరణలను తీసుకొచ్చేందుకు కూడా కసరత్తు చేస్తోంది. విద్యార్థుల ప్రయోజనాలు, విద్యా వ్యవస్థ స్థిరత్వం కోసం కట్టుబడి ఉండేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ కమిటీలో విద్యా రంగానికి చెందిన పలువురికి చోటు కల్పించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks