Phone Tapping Case : ఫోన్​ ట్యాపింగ్​ కేసులో హరీశ్​ రావుపై సిద్దిపేటలో ఎఫ్​ఐఆర్​

Phone Tapping Case : ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి హరీశ్‌రావుపై సిద్దిపేటలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

Published on: Nov 1, 2026, 15:24:10 IST
By , Siddipet
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కొత్త మలుపు తీసుకుంది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావుపై నమోదైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసు స్టేషన్ నుంచి సిద్ధిపేట వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు బదిలీ అయిన ఈ కేసులో అధికారులు తాజాగా కొత్త ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పాత ఎఫ్‌ఐఆర్‌కు తోడుగా ఈసారి మరికొన్ని సెక్షన్లను జోడిస్తూ కేసు తీవ్రతను పెంచారు.

మాజీ మంత్రి హరీశ్ రావు
మాజీ మంత్రి హరీశ్ రావు

గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ప్రాథమిక ఎఫ్‌ఐఆర్‌తో పోలిస్తే, సిద్ధిపేట వన్‌టౌన్ పోలీసులు నమోదు చేసిన కొత్త ఎఫ్‌ఐఆర్‌లో అదనంగా ఆరు కఠినమైన సెక్షన్లను చేర్చారు. ఐపీసీ (IPC) సెక్షన్లు 419, 420, 467, 406, ఐటీ యాక్ట్ (IT Act) సెక్షన్లు 66C (అనుమతి లేకుండా ఇతరుల ఐడెంటిటీ సమాచారాన్ని దొంగిలించడం), 66D (కంప్యూటర్ వనరులను ఉపయోగించి ఆన్‌లైన్ మోసాలకు పాల్పడటం) కొత్త సెక్షన్లు చేర్చారు.

ఈ కొత్త సెక్షన్ల జోడించడంతో కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. బాధితుడైన చక్రధర్‌ గౌడ్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2024 డిసెంబర్ 1న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తొలిసారిగా కేసు నమోదైంది. ఈ విచారణ ప్రక్రియలో అధికారులు రూపొందించిన ఎఫ్‌ఐఆర్‌లో ఎ1 మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎ2 హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు ఉన్నారు.

2023 సంవత్సరంలో తనతో పాటు తన భార్యకు చెందిన వ్యక్తిగత మొబైల్ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని చక్రధర్ గౌడ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాలు, సమాచారం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడి తమ వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలిగించారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగిస్తూ చేపట్టిన ఈ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపై కూడా దర్యాప్తు జరుగుతోంది. కేసు సిద్ధిపేటకు బదిలీ కావడంతో పాటు కొత్త ఎఫ్‌ఐఆర్‌తో అదనపు సెక్షన్లు నమోదు కావడంతో రాబోయే రోజుల్లో విచారణ ఏ మలుపు తిరుగుతుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More