హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో దీపావళి పటాకుల బాణసంచా కాల్పులు విషాదాన్ని నింపాయి. హైదరాబాద్ నగరంలోని మెహిదీపట్నం పరిధిలో ఉన్న ప్రభుత్వ సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి కంటి గాయాలతో కనీసం 32 మంది బాధితులు చికిత్స కోసం వచ్చారు. బాధితుల్లో అత్యధికులు చిన్నపిల్లలే ఉండటం గమనార్హం.

గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్చుకుని ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. మిగిలిన 26 మందికి ప్రాథమిక చికిత్స అందించి, అవసరమైన మందులు ఇచ్చి ఇంటికి పంపించినట్లు వైద్యులు తెలిపారు. వీరిని ఫాలో-అప్ చికిత్స కోసం మళ్లీ ఆస్పత్రికి రావాలని సూచించారు.
ఇద్దరి పరిస్థితి విషమం..!
సరోజినీ దేవి కంటి ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ మహమ్మద్ ఇబ్రహీం వార్తా సంస్థ 'ఎఎన్ఐ'తో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. ఆస్పత్రిలో చేరిన ఆరుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని….. వారికి శస్త్రచికిత్సలు చేసేందుకు వైద్య బృందం ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. ఈ సందర్భంలో ఆయన ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించారు. "పెద్దల పర్యవేక్షణ లేకుండా పిల్లలను పటాకులు కాల్చనివ్వవద్దు. ఎందుకంటే ఆస్పత్రికి వస్తున్న బాధితుల్లో ఎక్కువ మంది చిన్నపిల్లలే ఉన్నారు," అని ఆయన విజ్ఞప్తి చేశారు.
బాణసంచా కాల్చేటప్పుడు తెరిచిన విశాలమైన ప్రదేశాలను ఎంచుకోవాలని, నిప్పురవ్వలు ఎగిరిపడినా లేదా ప్రమాదం జరిగినా వెంటనే ఆర్చేందుకు వీలుగా నీటిని సిద్ధంగా ఉంచుకోవాలని డాక్టర్ ఇబ్రహీం సూచించారు. ఒకవేళ పొరపాటున కంటికి గాయమైతే వెంటనే స్వచ్ఛమైన నీటితో కంటిని కడగాలని చెప్పారు. ఇంట్లో ఎలాంటి సొంత వైద్యం చేసుకోకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని కంటి ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలని స్పష్టం చేశారు.
పరిస్థితిని సమీక్షించేందుకు నాంపల్లి ఏఐఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ సరోజినీ దేవి ఆస్పత్రికి చేరుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి గాయపడిన వారి సంఖ్య పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల్లో ఒకరి కంటి చూపు దెబ్బతిందని, దానిని తిరిగి పునరుద్ధరించడం సాధ్యం కాదని వైద్యులు తనకు తెలిపారని ఆయన పేర్కొన్నారు. "ప్రజలంతా దీపావళి పండుగను ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అయితే పిల్లలు తప్పనిసరిగా పెద్దల పర్యవేక్షణలోనే పటాకులు కాల్చేలా చూసుకోవాలి," అని హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.
{{/usCountry}}పరిస్థితిని సమీక్షించేందుకు నాంపల్లి ఏఐఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ సరోజినీ దేవి ఆస్పత్రికి చేరుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి గాయపడిన వారి సంఖ్య పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల్లో ఒకరి కంటి చూపు దెబ్బతిందని, దానిని తిరిగి పునరుద్ధరించడం సాధ్యం కాదని వైద్యులు తనకు తెలిపారని ఆయన పేర్కొన్నారు. "ప్రజలంతా దీపావళి పండుగను ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అయితే పిల్లలు తప్పనిసరిగా పెద్దల పర్యవేక్షణలోనే పటాకులు కాల్చేలా చూసుకోవాలి," అని హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.
{{/usCountry}}