Bhadrachalam : గోదావరిలో విషాదం - ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతు, ఇద్దరు మృతి
గోదావరి నదిలో స్నానానికి వెళ్లినవారిలో ఐదుగురు ఇంజినీరింగ్ యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరంలో జరిగింది.
గోదావరి నదిలో విషాదం చోటు చేసుకుంది. స్నానానికి వెళ్లిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరంలో జరిగింది. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా… మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రాథమిక వివరాల ప్రకారం…. అమరావతిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు కూనవరం రోడ్డులోని గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు దిగారు. నది లోతు తెలియకపోవటంతో… ప్రమాదవశాత్తూ ఐదుగురు విద్యార్థులు మునిగిపోయారు. మరో ఇద్దరు మాత్రమే ఒడ్డుకు చేరుకున్నారు.
కొనసాగుతున్న గాలింపు చర్యలు…
ఒడ్డుకు చేరుకున్న విద్యార్థులకు స్థానికులతో పాటు పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. స్థానికులు బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా…. ఇద్దరి మృతదేహాలు లభ్యమ్యాయి. వీరిని శ్రీకర్ (భద్రాచలం), అభిరామ్ (భద్రాచలం) లుగా గుర్తించారు. మరో ముగ్గురు తేజ (ఉయ్యూరు), నవదీప్ (ఉయ్యూరు), సతీష్ కుమార్ (మదనపల్లి) గల్లంతు కాగా… వీరికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.గాలింపు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

