తెలంగాణలోని పేద, అల్పాదాయ వర్గాల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. క్యూర్(CURE - హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్) పరిధిని మినహాయించి, రాష్ట్రంలోని ఇతర ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలో నిర్మించే ఫ్లాట్లను లబ్ధిదారులకు కేవలం రూ.3.50 లక్షల అతి తక్కువ ధరకే అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఒక్కో ఫ్లాటుపై ప్రభుత్వం ఏకంగా రూ.5 లక్షల సబ్సిడీని భరించడంతో పాటు, భూమి వాటాను ఉచితంగా అందిస్తోంది.
మొదటి విడతలో 2,400 ఫ్లాట్లు.. ఎక్కడెక్కడంటే?

తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐదు ప్రాంతాల్లో మొత్తం 2,400 ఫ్లాట్ల నిర్మాణానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు ఇప్పటికే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక్కో ప్రాంతంలో 480 ఫ్లాట్ల చొప్పున నిర్మించనున్నారు. నిజామాబాద్ జిల్లా నాగారం పరిధిలోని ఆర్‌జీకే (RGK) కాలనీ, గ్రేటర్ వరంగల్ (గీసుకొండ మండలం) గొర్రెకుంట ప్రాంతం, గ్రేటర్ వరంగల్ (కాజీపేట మండలం) మడికొండ ప్రాంతం, నల్గొండ జిల్లా మామిళ్లగూడ పరిధిలోని డీవీకే రోడ్డు, మహబూబ్‌నగర్ జిల్లా బండమీదిపల్లి ప్రాంతంలో నిర్మాణాలు జరగనున్నాయి.
సులభమైన చెల్లింపు విధానం
లబ్ధిదారులపై ఒకేసారి ఆర్థిక భారం పడకుండా, మొత్తం రూ.3.50 లక్షలను 4 సులభ వాయిదాలలో చెల్లించే వెసులుబాటు కల్పించారు: మొదటి విడత ఫ్లాటు కేటాయింపు సమయంలో రూ.1,00,000, రెండో విడత ఆర్‌సీసీ నిర్మాణ పనుల సమయంలో రూ.1,00,000, మూడో విడత ఫినిషింగ్ పనుల సమయంలో రూ.1,00,000, నాలుగో విడత ఫ్లాటును పూర్తిస్థాయిలో అప్పగించే సమయంలో మిగిలిన రూ.50,000 చెల్లించాలి.
అర్హతలు, దరఖాస్తు నిబంధనలు
క్యూర్ పరిధిలో ఎదురైన గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, జిల్లాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం నిబంధనలను మరింత సరళతరం, కఠినతరం చేసింది. సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్న అల్పాదాయ వర్గాల వారు మాత్రమే అర్హులు. కుటుంబ వార్షికాదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి. దరఖాస్తుదారునికి ఆ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా సొంత ఇల్లు లేదా ఖాళీ ప్లాటు ఉండరాదు.
ప్రతి ఫ్లాటును 512 చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మిస్తారు. మీ సేవా కేంద్రాల ద్వారా రూ.100 దరఖాస్తు రుసుముతో పాటు, రూ.10,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ నంబర్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ లాటరీలో ఫ్లాటు రాకపోతే టోకెన్ అడ్వాన్స్ రూ.10 వేలను తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు.
{{/usCountry}}ప్రతి ఫ్లాటును 512 చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మిస్తారు. మీ సేవా కేంద్రాల ద్వారా రూ.100 దరఖాస్తు రుసుముతో పాటు, రూ.10,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ నంబర్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ లాటరీలో ఫ్లాటు రాకపోతే టోకెన్ అడ్వాన్స్ రూ.10 వేలను తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు.
{{/usCountry}}ప్రభుత్వం ఇచ్చే ఈ ఫ్లాట్లను కేటాయించిన నాటి నుండి 10 సంవత్సరాల వరకు ఇతరులకు విక్రయించడం గానీ, అద్దెకు ఇవ్వడం గానీ నిషేధం. అయితే ఇంటి నిర్మాణ చెల్లింపుల కోసం బ్యాంకుల ద్వారా రుణం (Home Loan) పొందే అవకాశం ఉంది.
360 డిగ్రీల కోణంలో పారదర్శక ఎంపిక
అనర్హులకు ఇళ్లు దక్కకుండా ఉండేందుకు అధికారులు 360 డిగ్రీల కోణంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపికైన తర్వాత కూడా క్షేత్రస్థాయిలో మరోసారి విచారణ జరిపి అర్హతలను ధృవీకరించుకుంటారు. దరఖాస్తులకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే హౌసింగ్ బోర్డు కాల్ సెంటర్ నంబర్ 040-24603572 ను సంప్రదించవచ్చు.
రాబోయే రెండేళ్లలో మరిన్ని కార్పొరేషన్లకు
ప్రస్తుతం ప్రకటించిన ఐదు ప్రాంతాల్లో కేటాయింపులు పూర్తయిన వెంటనే, రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాలతో పాటు మరికొన్ని పురపాలికల్లో హౌసింగ్ బోర్డుకు చెందిన ఖాళీ స్థలాలను అధికారులు గుర్తించారు.