SCR Festival Special Trains : దీపావళి వేళ ప్రయాణికులకు అలర్ట్ - చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు, వయా వరంగల్

SCR Diwali Chhath Special Trains : దీపావళి, ఛత్ పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి - రక్సాల్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నవంబర్ నెలలో నడిచే ఈ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

Published on: Nov 6, 2026, 20:35:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

పండుగల వేళ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. రాబోయే దీపావళి, ఛత్ పూజా ఉత్సవాల సందర్భంగా రైళ్లలో తీవ్రంగా పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని అదుపు చేసేందుకు హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి బీహార్‌లోని రక్సాల్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు
చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు
  • చర్లపల్లి - రక్సాల్ స్పెషల్ ట్రైన్ (రైలు సంఖ్య- 07007) : ఈ ప్రత్యేక రైలు చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం మధ్యాహ్నం 15:15 గంటలకు బయలుదేరుతుంది. శుక్రవారం ఉదయం 05:55 గంటలకు రక్సాల్ చేరుకుంటుంది. ఈ రైలు నవంబర్ 11, నవంబర్ 18 మరియు నవంబర్ 25, 2026 తేదీల్లో సేవలు అందిస్తుంది. మొత్తం 3 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
  • రక్సాల్ - చర్లపల్లి స్పెషల్ ట్రైన్ (రైలు సంఖ్య - 07008) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు రక్సాల్ నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 19:15 గంటలకు బయలుదేరి, ఆదివారం ఉదయం 10:00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైలు నవంబర్ 13, నవంబర్ 20 మరియు నవంబర్ 27, 2026 తేదీల్లో సర్వీసులు నిర్వహిస్తుంది. ఈ మార్గంలో కూడా 3 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

ఆగే ప్రధాన రైల్వే స్టేషన్లు….

ఈ పండుగ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా ప్రయాణించేటప్పుడు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి.

తెలంగాణలో కాజీపేట, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ రైళ్లకు నిలుపుదల కల్పించారు. అలాగే బల్లార్షా, సేవారామ్, నాగ్‌పూర్, ఇటార్సి, మదన్ మహల్, కాట్ని, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛోకి, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ (మొఘల్ సరాయ్), బక్సర్, ఆరా, దానాపూర్, పాట్లీపుత్ర, హాజీపూర్, ముజఫ్ఫర్‌పూర్, సీతామఢీ, బైరగ్నియా స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.

ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో థర్డ్ ఏసీ (3AC), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More