Telangana AP SIR : తెలంగాణ, ఏపీలో ‘సర్’ గడువు పొడిగింపు - కొత్త తేదీలివే
తెలంగాణ, ఏపీ సహా ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల సీఈఓల అభ్యర్థన మేరకు ఈ ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను సవరిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు గడువు పెంపు వివరాలను తెలియజేస్తూ ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారులకు (సీఈఓ) ఎన్నికల సంఘం వేర్వేరుగా లేఖలు రాసింది. వివిధ సాంకేతిక, పరిపాలనా కారణాల వల్ల గతంలోనూ పలుమార్లు ఈ ప్రత్యేక సమగ్ర సవరణ గడువును పొడిగించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రాల వారీగా కొత్త షెడ్యూల్ వివరాలు :
మహారాష్ట్రలో ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, ఫిర్యాదుల దాఖలు గడువును అక్టోబరు 26 నుంచి నవంబరు 13 వరకు పొడిగించారు. నోటీసుల జారీ, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ నవంబరు 25 వరకు కొనసాగుతుంది. తుది ఓటర్ల జాబితాను నవంబరు 30న ప్రచురించనున్నారు. నిజానికి ఇక్కడ ఆగస్టు 31న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయగా, క్లెయిమ్‌ల పరిష్కారానికి గతంలో నవంబరు 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.
దేశ రాజధాని ఢిల్లీలో అభ్యంతరాలు, దరఖాస్తుల స్వీకరణ గడువును అక్టోబరు 30 నుంచి నవంబరు 25 వరకు పొడిగించారు. దరఖాస్తుల పరిష్కార గడువును నవంబరు 30 నుంచి డిసెంబరు 15కి మార్చారు. అన్ని పరిశీలనల అనంతరం డిసెంబరు 22న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు హర్యానా, నాగాలాండ్ రాష్ట్రాల్లోనూ సవరించిన తేదీలకు అనుగుణంగా ఓటర్ల నమోదు, మార్పులు చేర్పుల ప్రక్రియ కొనసాగనుంది. అర్హులైన పౌరులు ఈ పొడిగించిన(నవంబర్ 26) గడువును వినియోగించుకుని ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు. తుది జాబితాను నవంబర్ 30వ తేదీన ప్రకటిస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

