TG High Court Recruitment : తెలంగాణ హైకోర్టులో రిసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలు - నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు తేదీలివే
Telangana High Court Recruitment : రిసెర్చ్ అసిస్టెంట్ (లా) పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు 2026 నవంబరు 30 వ తేదీ వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Telangana High Court Recruitment : తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏడాది కాలపరిమితి కోసం రిసెర్చ్ అసిస్టెంట్ (లా) పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. న్యాయమూర్తులకు పరిశోధనలో సహాయంగా పనిచేసేందుకు, అలాగే జ్యుడీషియల్ అకాడమీలో సేవలందించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు…
మొత్తం 16 రిసెర్చ్ అసిస్టెంట్ (లా) ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 14 పోస్టులు తెలంగాణ హైకోర్టు గౌరవ న్యాయమూర్తులకు పరిశోధన సహాయకులుగా పనిచేసేందుకు కాగా, మరో 2 పోస్టులను సికింద్రాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీలో పనిచేయడానికి కేటాయించారు. ఈ నియామకాలు పూర్తిస్థాయిలో ఒప్పంద ప్రాతిపదికన ఏడాది పాటు ఉంటాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారత పౌరులై ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 10+2 తర్వాత ఐదేళ్ల రెగ్యులర్ లా డిగ్రీ లేదా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మూడేళ్ల ఎల్ఎల్‌బీ (LL.B) పూర్తి చేసి ఉండాలి. నోటిఫికేషన్ వెలువడిన తేదీకి ముందు రెండేళ్ల వ్యవధిలోనే లా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
అభ్యర్థుల వయస్సు దరఖాస్తుల సమర్పణకు ముందు వచ్చే జూలై 1 నాటికి 30 ఏళ్లు మించకూడదు. దీనితో పాటు, మనుపాత్ర , ఎస్‌సీసీ ఆన్‌లైన్ (SCC Online), లెక్సిస్‌నెక్సిస్ (LexisNexis), వెస్ట్‌లా (Westlaw) వంటి లీగల్ సెర్చ్ ఇంజిన్ల ద్వారా సమాచారాన్ని సేకరించే కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థులు ఇతర ఉద్యోగాలు, వృత్తులు లేదా చదువుల్లో కొనసాగుతూ ఉండకూడదు.
దరఖాస్తు విధానం…
ఆసక్తి గల అభ్యర్థులు హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ ( http://tg.tshc.gov.in ) నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తు ఫారానికి గెజిటెడ్ అధికారిచే అటెస్టేషన్ చేయించిన ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎల్ఎల్‌బీ మరియు ఎన్‌రోల్‌మెంట్ సర్టిఫికెట్ల కాపీలను జత చేయాలి. వీటితో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ జత చేసి కవరుపై "Application for the post of Research Assistants (Law)" అని స్పష్టంగా రాయాలి. దరఖాస్తులను రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలెడ్జ్‌మెంట్ డ్యూ (Registered Post with Acknowledgment Due) ద్వారా ఈ కింది చిరునామాకు పంపాలి:
- చిరునామా: రిజిస్ట్రార్ జనరల్, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, హైదరాబాద్.
- దరఖాస్తుకు చివరి తేదీ : 2026 నవంబరు 30 సాయంత్రం 5:00 గంటల వరకు. నిర్ణీత సమయం దాటిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిశీలించరని, తపాలా ఆలస్యానికి రిజిస్ట్రీ బాధ్యత వహించదని స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

