...
...
Next Story

Srisailam Reservoir : శ్రీశైలం జలశయానికి తగ్గిన వరద ప్రవాహం

Srisailam Reservoir : వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టులకు వరద ప్రవాహం తగ్గుతుంది. జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గింది.

Published on: Aug 9, 2026, 12:03:01 IST
Advertisement

మహారాష్ట్ర, కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గముఖం పట్టడంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గింది. గత కొన్ని రోజులుగా దిగువకు భారీగా నీటిని విడుదల చేసిన అధికారులు, ఇన్ ఫ్లో తగ్గడంతో ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను పూర్తిగా మూసివేశారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు తగ్గిన వరద
శ్రీశైలం ప్రాజెక్టుకు తగ్గిన వరద

కర్ణాటకలోని అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వచ్చే వరద నీటి ప్రవాహం తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 80,000 క్యూసెక్కులు, దిగువకు విడుదల 39,608 క్యూసెక్కులుగా ఉన్నాయి. నీటి విడుదల ఆధారంగా జూరాల జలవిద్యుత్ కేంద్రంలోని 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది.

గరిష్ట నీటిమట్టం 318.51 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 317.51 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్ట్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.66 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్ట్ ఎడమ, కుడి కాలువల ద్వారా దాదాపు 1.03 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

జూరాల ప్రాజెక్ట్ గేట్లు మూసివేయడం, దిగువ కృష్ణా నదిలోకి నీటి విడుదల తగ్గించడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే వరద నీటి ప్రవాహం కూడా తగ్గింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో జూరాల నుంచి శ్రీశైలానికి కేవలం 36,233 క్యూసెక్కుల వరద ప్రవాహం మాత్రమే వస్తుంది. శనివారం సాయంత్రం నుంచి శ్రీశైలానికి వరద తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం డ్యామ్ గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 878 అడుగులుగా ఉన్నది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గానూ ప్రస్తుతం శ్రీశైలంలో 178.74 టీఎంసీలుగా ఉంది. జల విద్యుత్ కేంద్రాల ద్వారా 38,369 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల అవుతుంది.

ఆగస్టు 13న కేఆర్ఎంబీ సమావేశం

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe