IRCTC Karnataka Tour Package : కర్ణాటక టూర్ ప్యాకేజీ - బడ్జెట్ ధరలోనే 6 రోజుల ట్రిప్, పూర్తి వివరాలు

IRCTC Coastal Karnataka Tour Package : పర్యాటకుల  కోసం IRCTC టూరిజం 'కోస్టల్ కర్ణాటక' రైలు ప్యాకేజీని తీసుకొచ్చింది. 5 రాత్రులు, 6 రోజుల పాటు సాగే ఈ యాత్రలో ఉడిపి, మురుడేశ్వర్, శృంగేరి క్షేత్రాలను చూడొచ్చు. 

Published on: Aug 3, 2026, 13:07:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

IRCTC Coastal Karnataka Tour Package : పర్యాటకులు, ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తుల కోసం భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. "కోస్టల్ కర్ణాటక" పేరుతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను, సుందరమైన తీరప్రాంతాలను సందర్శించవచ్చు. 5 రాత్రులు, 6 రోజుల పాటు సాగే ఈ ప్యాకేజీ హైదరాబాద్‌లోని కాచీగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి మంగళవారం ప్రారంభమవుతుంది.

హైదరాబాద్ - కర్ణాటక టూర్ ప్యాకేజీ (images from Unsplash)
హైదరాబాద్ - కర్ణాటక టూర్ ప్యాకేజీ (images from Unsplash)

ప్రసుతం ఈ ప్యాకేజీ ఆగస్టు 11, 2026న అందుబాటులో ఉంది. ఈ యాత్రలో భాగంగా ప్రయాణికులు ఉడిపి, కొల్లూరు, మురుడేశ్వర్, గోకర్ణ, శృంగేరి, హోరనాడు, మంగళూరులోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.

టూర్ షెడ్యూల్ :

  • మొదటి రోజు (మంగళవారం) : కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 06:05 గంటలకు రైలు నంబర్ 12789 (కాచీగూడ - మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్) ద్వారా ప్రయాణం ప్రారంభమవుతుంది. రోజంతా రైలు ప్రయాణం ఉంటుంది.
  • రెండో రోజు (బుధవారం) : ఉదయం 09:15 గంటలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఉడిపికి తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం, మాల్పే బీచ్‌ను సందర్శిస్తారు. ఆ రాత్రి ఉడిపిలోనే బస ఉంటుంది.
  • మూడో రోజు (గురువారం) : ఉదయాన్నే కొల్లూరు బయలుదేరి ప్రసిద్ధ మూకాంబిక అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం మురుడేశ్వర్‌ వెళ్లి, అక్కడి భారీ శివుని విగ్రహాన్ని…. దేవాలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం గోకర్ణ చేరుకుని ఆలయం, బీచ్‌ చూసిన తర్వాత తిరిగి ఉడిపిలోని హోటల్‌కు చేరుకుంటారు.
  • నాలుగో రోజు (శుక్రవారం) : హోటల్ చెకౌట్ చేసి హోరనాడు శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయాన్ని దర్శిస్తారు. తర్వాత శృంగేరి వెళ్లి శ్రీ శారదాంబ అమ్మవారిని దర్శించుకుని, సాయంత్రానికి మంగళూరు చేరుకుంటారు. ఆ రాత్రి మంగళూరులోనే బస చేస్తారు.
  • ఐదో రోజు (శనివారం) : మంగళూరులోని మంగళాదేవి ఆలయం, కద్రి మంజునాథ స్వామి ఆలయం, కుద్రోలి గోకర్ణనాథ ఆలయం మరియు తన్నీరుభావి బీచ్‌ను చూస్తారు. సాయంత్రం 19:00 గంటలకు మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు. రాత్రి 20:00 గంటలకు రైలు నంబర్ 12790 ద్వారా తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.
  • ఆరో రోజు (ఆదివారం ): రాత్రి 23:40 గంటలకు కాచీగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.

ఈ ప్యాకేజీ ధరలు చూస్తే….. స్టాండర్డ్ (స్లీపర్ క్లాస్) క్లాస్ లో సింగిల్ షేరింగ్ రూ. 39,920, ట్విన్ షేరింగ్ రూ. 21,370, ట్రిపుల్ షేరింగ్ రూ. 16,500గా నిర్ణయించారు. కంఫర్ట్ (3AC) క్లాస్ లో అయితే సింగిల్ షేరింగ్ రూ. 42,990, ట్విన్ షేరింగ్ రూ. 24,440, ట్రిపుల్ షేరింగ్ రూ. 19,560 కాగా.. బెడ్‌తో ఉన్న పిల్లలకు రూ. 12,490, బెడ్ లేని పిల్లలకు రూ. 11,090 ఛార్జ్ చేస్తారు.

ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. https://www.irctctourism.com వెబ్ సైట్ లో ఈ టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More