...
...
Next Story

Formula E race Case : ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో ఏసీబీ ఛార్జిషీట్‌ దాఖలు - ఏ1గా కేటీఆర్‌

Formula E race case : ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో ఏసీబీ ఛార్జీషీట్ ను దాఖలు చేసింది. నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం… ఏ1గా కేటీఆర్ ను పేర్కొన్నారు.

Published on: Mar 24, 2026 07:11 AM IST
Advertisement

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని కోర్టులో ఏసీబీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఛార్జీషీట్ లోని వివరాల ప్రకారం… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను ఏ1గా ఉన్నారు.

ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో ఏ1గా కేటీఆర్‌ - ఏసీబీ ఛార్జీషీట్
ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో ఏ1గా కేటీఆర్‌ - ఏసీబీ ఛార్జీషీట్

ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ ఎన్ రెడ్డి పేర్లను పేర్కొన్నారు. ఏ4గా స్పోర్ట్స్‌ కన్సల్టెంట్‌ కిరణ్‌ మల్లేశ్వర్‌రావు, ఏ5గా యూకేకు చెందిన ఎఫ్‌ఈవో(ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌) సంస్థను చేర్చారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో హైదరాబాద్‌లో ఈ రేసు నిర్వహించారు. అనుమతులు లేకుండా రూ. 55 కోట్లు విదేశీ కరెన్సీలో చెల్లించినట్టు ఆరోపణలు వచ్చాయి. మరోవైపు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత… 2024లో నిర్వహించాల్సిన రేసును కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. సుమారు రూ .55 కోట్ల చెల్లింపులలో అవకతవకలకు సంబంధించిన వ్యవహారంపై విచారణకు ఆదేశించింది.

2024 డిసెంబరులో కేటీఆర్, అర్వింద్ కుమార్ తో పాటు ఇతరులపై అవినీతి నిరోధక చట్టం, భారత శిక్షాస్మృతిలోని నిబంధనల కింద ఏసీబీ కేసు నమోదు చేసింది.

అప్పటి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గత ఏడాది నవంబర్లో కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కు అనుమతి కూడా ఇచ్చారు. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ పై ప్రాసిక్యూషన్ ను కేంద్రం గత నెలలో క్లియర్ చేసింది. దీంతో ఈ కేసులో ఏసీబీ వేగంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఛార్జీషీట్ ను దాఖలు చేసింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe