ఆ కంపెనీతో పాటు సీఎం రేవంత్ పై విచారణ జరిపించండి - కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కేటీఆర్ లేఖ

కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు కేటీఆర్ లేఖ రాశారు. KLSR ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ పైన నమోదైన కేసులో విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సాక్ష్యాధారాలను తారుమారు చేసిందన్నారు. సీఎం ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని ఆరోపించారు.

Published on: Mar 13, 2026 5:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ KLSR ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ పైన నమోదైన కేసులో విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సాక్ష్యాధారాలను తారుమారు చేసిందని పేర్కొన్నారు. సేకరించిన సాక్ష్యాధారాలు పోయాయని ప్రభుత్వ అధికారులు కోర్టులో చెప్పడం దారుణమన్నారు.

కేటీఆర్
కేటీఆర్

సాక్ష్యాధారాలను మాయం చేయించారు - కేటీఆర్

ముఖ్యమంత్రి తన బినామీ కంపెనీ కోసమే అధికారుల పైన ఒత్తిడి తీసుకువచ్చి సాక్ష్యాధారాలను మాయం చేయించారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలోని విచారణ సంస్థలను పోలీసు అధికారులను నమ్మే పరిస్థితి లేదని ప్రస్తావించారు. తన బినామీ కంపెనీ కోసం సాక్ష్యాధారాలను ముఖ్యమంత్రి మాయం చేయించారని పేర్కొన్నారు.

“రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. పోలీస్ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం పోయింది. KLSR కంపెనీ దివాలా తీసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు కేటాయిస్తున్నారు. ఆ సంస్థపై ఉన్న విచారణను అడ్డుకుంటున్నాడు. KLSR కంపెనీ పైన ఉన్న ఆర్థిక పరమైన ఆరోపణలు, కేసుల పైన పక్షపాతం లేకుండా…. ఒత్తిడి లేకుండా నిష్పాక్షిక విచారణ జరిగేలా చూడాలని విజ్ఞప్తి. ఇప్పటికే దివాలా ప్రక్రియ కొనసాగుతున్న కంపెనీ కోసం రేవంత్ రెడ్డి 2,500కు పైగా భారీ కాంట్రాక్టులను కేటాయించారు. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులతో పాటు యంగ్ ఇండియా స్కూల్ ప్రాజెక్టులు, రోడ్డు నిర్మాణ పనులను అడ్డగోలుగా రేవంత్ రెడ్డి దివాలా తీసిన ఈ కంపెనీకి అప్పచెబుతున్నారు” అని కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు.

దర్యాప్తు చేయించండి - కేటీఆర్ విజ్ఞప్తి

KLSR కంపెనీకి, రేవంత్ రెడ్డికి ఉన్న అనుబంధం అందరికీ తెలుసని కేటీఆర్ తెలిపారు. “కంపెనీ కోసం నేషనల్ లా ట్రిబ్యునల్ విచారణలో కూడా రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ KLSR కంపెనీ అంశంలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు తగిన విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి వెంటనే ఈ కంపెనీ చేస్తున్న నేరాలు, ఈ కంపెనీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అనుచిత లబ్ది నేపథ్యంలో సీబీఐ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) వంటి ఏజెన్సీలతో సంపూర్ణ దర్యాప్తు చేయించాలి” అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు ఈ లేఖ ప్రతులను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కార్పొరేట్ గవర్నెన్స్ బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌కు కేటీఆర్ పంపించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More