ఐయామ్ ఫ్యాన్ ఆఫ్ కృష్ణ.. అల్లు సినిమాస్‌లో సీఎం రేవంత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Allu Cinemas : దేశంలో సినిమాకు గొప్ప పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని అల్లు కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. తాను కూడా సినిమా అభిమానిని చెప్పారు.

Published on: Mar 12, 2026, 21:49:04 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కోకాపేట్‌లో అల్లు సినిమాస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, అల్లు అరవింద్, అల్లు అర్జున్, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తాను కూడా సినిమా అభిమాని అని చెప్పారు. సినిమా సాంకేతికంగా వేగంగా ముందుకు వెళుతుందన్నారు. దేశంలో సినిమాకు గొప్ప పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని అల్లు కుటుంబాన్ని సీఎం అభినందించారు.

అల్లు సినిమాస్‌ ప్రారంభించిన సీఎం రేవంత్
అల్లు సినిమాస్‌ ప్రారంభించిన సీఎం రేవంత్

'ప్రేక్షకులని కట్టిపడేసే సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి. బాహుబలి, కల్కి, అరుంధతి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు తెలుగు సినిమాను హైదరాబాద్ తీసుకొచ్చారు. కృష్ణ సినిమాలో అడ్వెంచర్స్ చేశారు. నేను కృష్ణ అభిమానిని. లారీ ఎక్కి వనపర్తికి వెళ్లి నేను సినిమాలు చూసే వాడిని.' అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

కృష్ణ ఏడాదికి 15 సినిమాలు చేసేవారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు ఐదారేళ్లుకు ఒక సినిమా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సినిమా సమాజాన్ని ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. సినిమాను పరిశ్రమగా గుర్తించి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. ఐటీ, ఫార్మాతో పాటు సినిమా పరిశ్రమ గొప్ప స్థాయికి తీసుకువెళ్తామన్నారు. తెలుగు సినిమాకు కోలీవుడ్, శాండిల్ వుడ్, బాలివుడ్ పోటీ కాదు.. హాలివుడ్ సినిమాలు ఇక్కడ చిత్రీకరించాలని మాట్లాడారు.

'కృష్ణా నగర్ నుంచి గొప్ప సినిమాలు తీసే అనేక మంది సాంకేతిక నిపుణులు, కళాకారులు వస్తున్నారు. సినిమా పరిశ్రమ పెరగడానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. మన సినిమాలు హాలీవుడ్‌కి వెళ్ళాలి. భాష అడ్డంకి కాదు ఇప్పుడు.. టాలెంట్ మాత్రమే కనిపిస్తుంది.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

అల్లు సినిమాస్ ప్రారంభోత్సవంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. 'ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి హైదరాబాద్ కోకాపేట్‌లో అల్లు సినిమా థియేటర్ కాంప్లెక్స్‌ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్‌కు అభినందనలు. హాలీవుడ్ స్థాయి సాంకేతికతతో నిర్మితమైన ఈ కాంప్లెక్స్, గ్లోబల్ డెస్టినేషన్‌గా ఎదుగుతున్న హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచుతుంది. 'Telangana Rising 2047' విజన్‌లో భాగంగా వినోద రంగాన్ని ఒక బలమైన పరిశ్రమగా తీర్చిదిద్దుతూ, అంతర్జాతీయ పెట్టుబడులకు, అత్యాధునిక మౌలిక సదుపాయాలకు మన రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.' అని భట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More