అక్కినేని హీరోతో లవ్ ఎఫైర్ రూమర్లు-ప్రేమ పెళ్లే చేసుకుంటా-వెడ్డింగ్ గురించి నేనే అనౌన్స్ చేస్తానన్న మీనాక్షి చౌదరి
తెలుగులో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న టాలెంటెడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తన పెళ్లిపై వస్తున్న రూమర్లపై స్పందించింది. లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పింది. మరోవైపు అక్కినేని హీరో సుశాంత్ తో ఆమె ప్రేమలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది మీనాక్షి చౌదరి. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన అప్ కమింగ్ మూవీ ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రం సంక్రాంతి 2026 స్పెషల్ గా జనవరి 14న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన ప్రేమ, పెళ్లిపై మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. లవ్ మ్యారేజీ చేసుకుంటానంది. మరోవైపు ఓ అక్కినేని హీరోతో ఆమె ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

పెళ్లిపై మీనాక్షి చౌదరి
సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అనగనగా ఒక రాజు సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్. ఈ భామ తన పెళ్లిపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. అనగనగా ఒక రాజు మూవీ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లిపై మాట్లాడింది. ‘‘నేను పెళ్లిచేసుకోబోతున్న అనే రూమర్లు విన్నప్పుడు నవ్వొస్తుంది. నో రా, నేనే చెప్తా. నేను అనౌన్స్ చేస్తా. దానికి ఇంకా టైమ్ ఉంది’’ అని మీనాక్షి చౌదరి చెప్పింది.
లవ్ మ్యారేజీ
పెళ్లికి ఇంకా టైమ్ ఉందని కానీ లవ్ మ్యారేజీ చేసుకుంటానని మీనాక్షి చౌదరి తెలిపింది. ‘‘ఇప్పుడైతే పెళ్లి చేసుకోను. తర్వాత ఏ మ్యారేజీ అయినా ఓకే. కానీ ఒకటే చెప్పాలంటే మంచి డిసిషన్. తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ పేరేంట్స్, బ్రదర్స్ గా ఎవరు ఉండాలనేది మీ చేతుల్లో లేదు. కానీ లైఫ్ పార్ట్ నర్ ఎవరు ఉండాలనేది మీ చేతుల్లో ఉంది. లవ్ మ్యారేజీ చేసుకుంటా’’ అని మీనాక్షి చౌదరి పేర్కొంది.
అక్కినేని హీరోతో
ఓ వైపు అక్కినేని హీరో సుశాంత్ తో మీనాక్షి చౌదరి లవ్ రిలేషన్ షిప్ లో ఉందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీళ్లిద్దరు కలిసి 2021లో వచ్చిన ‘ఇచట వాహనములు నిలపరాదు’ అనే సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీళ్లు ప్రేమలో ఉన్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. 2024లో వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ కూడా వచ్చింది. కానీ మీనాక్షి ఈ రూమర్లను గతంలో ఖండించింది.
అనగనగా ఒక రాజు
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన మూవీ ‘అనగనగా ఒక రాజు’. ఈ ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జనవరి 14న రిలీజ్ కానుంది. 2026 సంక్రాంతి రేసులో రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ లాంటి పెద్ద సినిమాలతో అనగనగా ఒక రాజు పోటీపడుతుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


