మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ మూవీ.. తండ్రిలా లవ్ మ్యారేజీ చేసుకోవాలనుకునే కొడుకు

తెలుగు రొమాంటిక్ మూవీ శశివదనే మరో ఓటీటీలోకి వచ్చేసింది. తండ్రిలా లవ్ మ్యారేజీ చేసుకోవాలనుకునే కొడుకు కథతో వచ్చిన మూవీ ఇది. మరి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలను ఇక్కడ చూసేయండి.  

Published on: Dec 13, 2025 9:10 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రొమాంటిక్ మూవీ ‘శశివదనే’ మరో ఓటీటీలోకి వచ్చేసింది. డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతున్న ఈ సినిమా ఇంకో ప్లాట్ ఫామ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ రొమాంటిక్ మూవీ థియేటర్లలో యూత్ ఆడియన్స్ ను అలరించింది. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోనూ సత్తాచాటుతోంది.

మరో ఓటీటీలోకి రొమాంటిక్ మూవీ (x)
మరో ఓటీటీలోకి రొమాంటిక్ మూవీ (x)

మరో ఓటీటీలోకి శశివదనే

రూరల్ లవ్ స్టోరీ శశివదనే మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా నవంబర్ 28న సన్ నెక్ట్స్ ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలోనూ ఆడియన్స్ కోసం అందుబాటులోకి వచ్చింది. రొమాంటిక్ మూవీ శశివదనేలో రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించారు.

శశివదనే స్టోరీ

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ స్టోరీ శశివదనే. గోదావరి లంక గ్రామంలో ఉండే ఓ సాధారణ యువకుడు రాఘవ (రక్షిత్). తల్లి చనిపోవడంతో తండ్రి (శ్రీమాన్) అన్నీ తానై సాయిని పెంచుతాడు. డిగ్రీ కంప్లీట్ చేసిన రాఘవ ఎమ్మెస్సీ చేయాలనుకుంటాడు. అదే సమయంలో తండ్రి లాగే ప్రేమ వివాహం చేసుకోవాలనే కలతో ఉంటాడు. అప్పుడే ఒక రోజు రోడ్డు మీద శశి (కోమలి)ని చూసి ప్రేమలో పడతాడు.

తండ్రి కాదనడంతో

శశి కూడా రాఘవను ప్రేమిస్తుంది. కానీ శశి తండ్రికి ఈ ప్రేమంటే ఇష్టముండదు. తన కూతురు ఒక సాధారణ యువకుడిని ప్రేమించడాన్ని అస్సలు ఒప్పుకోడు. కానీ శశి, రాఘవ రహస్యంగా కలుస్తూనే ఉంటారు. మరి చివరకు ఏమైంది? శశి, రాఘవ పెళ్లి చేసుకున్నారా? అందుకు శశి తండ్రి ఒప్పుకున్నాడా? అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

అంతంతమాత్రమే

థియేటర్లో శశివదనే మూవీ అంతంతమాత్రంగానే ఆడింది. పెద్దగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. రొటీన్ లవ్ స్టోరీ కావడంతో జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేకపోయారు. గోదావరి జిల్లాల్లోని వాతావరణం, అక్కడి మనుషుల తీరును బాగానే చూపించారు. కానీ వావ్ అనేలా ఒక్క మూమెంట్ ను కూడా తీర్చిదిద్దలేకపోయారు. దీంతో రొటీన్ లవ్ స్టోరీని చూసినట్లే అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా చప్పగానే సాగుతుంది.

అయితే థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయిన శశివదనే సినిమా ఓటీటీలో మాత్రం సత్తాచాటుతోంది. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ లవ్ స్టోరీలను ఇష్టపడే ఆడియన్స్ శశివదనే మూవీని చూసేయండి.