ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు బోల్డ్ సిరీస్- అంకుల్స్‌ను ఇష్టపడే హీరోయిన్- 4 ఎపిసోడ్స్‌తో స్ట్రీమింగ్- ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ తెలుగు బోల్డ్ అండ్ రొమాంటిక్ వెబ్ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2 స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్ల రొమాంటిక్ ఫన్‌తో సాగే ఈ వెబ్ సిరీస్ నాలుగు ఎపిసోడ్స్‌తో ఓటీటీ రిలీజ్ అయింది. మరి 3 రోజెస్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటనే వివరాలపై లుక్కేద్దాం.
తెలుగులో వైవిధ్యభరితమైన కంటెంట్‌తో ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ (డిసెంబర్ 13) ఓటీటీలోకి తెలుగు బోల్డ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2 స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

ముగ్గురు గ్లామర్ బ్యూటీలు
2021లో నేరుగా ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు బోల్డ్ కామెడీ సిరీస్ 3 రోజెస్ మంచి సక్సెస్ సాధించింది. అందులో ముగ్గురు గ్లామర్ బ్యూటీలు పాయల్ రాజ్‌పుత్, ఈషా రెబ్బా, పూర్ణ రొమాంటిక్ ఫన్‌తో మెప్పించారు. దాంతో ఆ సిరీస్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
గ్లింప్స్ నుంచి ట్రైలర్ వరకు
ఇప్పుడు తాజాగా అదే కిస్ సీన్లు, బోల్డ్ డైలాగ్స్, రొమాన్స్‌తో నాలుగేళ్లకు 3 రోజెస్ సిరీస్ సీక్వెల్ వచ్చేసింది. 3 రోజేస్ సీజన్ 2లో నటించిన హీరోయిన్లను పరిచయం చేస్తూ వదిలిన గ్లింప్స్ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన ఓటీటీ స్ట్రీమింగ్ ట్రైలర్ వరకు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
మారిన హీరోయిన్స్
అయితే, 3 రోజెస్ రెండో సీజన్‌లో ఇద్దరు హీరోయిన్స్ మారిపోయారు. మొదటి సీజన్‌లో ఉన్న ఈషా రెబ్బా రెండో సీజన్‌లోనూ కంటిన్యూ కాగా పాయల్, పూర్ణ స్థానాల్లోకి హాట్ బ్యూటి రాశి సింగ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ కుషిత కల్లపు వచ్చారు.
షో రన్నర్‌గా మారుతి
ఈ 3 రోజెస్ సీజన్ 2ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించగా.. డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరించారు. 3 రోజెస్ సీజన్ 2 సిరీస్‌కు కిరణ్ కే కరవల్ల దర్శకత్వం వహించారు. ముగ్గురు హీరోయిన్ల జీవితాల్లో జరిగిన రొమాంటికి ఇన్సిడెంట్స్, పెళ్లి, పార్టీ, అంకుల్స్‌పై ఇంట్రెస్ట్ వంటి అంశాలతో ఈ రెండో సీజన్‌ను తెరకెక్కించారు.
అంకుల్స్‌ను ఇష్టపడే పాత్ర
అంకుల్స్‌పై ఇంట్రెస్ట్ చూపించే పాత్రలో యంగ్ బ్యూటీ కుషిత కల్లపు క్యారెక్టర్ సాగితే సాంప్రాదాయంతోపాటు హాట్‌గా ఉండే పాత్రలో రాశి సింగ్ కనిపించింది. లైఫ్‌ను తనకు నచ్చినట్లుగా లీడ్ చేసుకునే యువతిగా ఈషా రెబ్బా క్యారెక్టర్ ఉంది. ఇలా ఇంట్రెస్టింగ్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో సాగే 3 రోజెస్ 2 ఓటీటీలో ఇవాళ ప్రీమియర్ అవుతోంది.
3 రోజెస్ 2 ఓటీటీ స్ట్రీమింగ్
ఆహాలో నేటి నుంచి 3 రోజెస్ సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇవాళ కేవలం నాలుగు ఎపిసోడ్స్‌ను మాత్రమే ఓటీటీ రిలీజ్ చేశారు. అవి కేవలం 29 నుంచి 31 నిమిషాల రన్‌టైమ్‌తో మాత్రమే ప్రీమియర్ అవుతున్నాయి. మరికొన్ని ఎపిసోడ్స్‌ను వారం తర్వాత ప్రసారం చేసే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


