Vijay: మొన్న 30 కోట్ల చీటింగ్, ఇప్పుడు విజయ్, త్రిషకు సపోర్ట్-సినిమాలు మనవి, జీవితాలు కాదంటూ దర్శకుడు విక్రమ్ భట్ పోస్ట్
Vikram Bhatt Support Thalapathy Vijay Trisha: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన భార్య సంగీత నుంచి ఆరోపణలు, విడాకుల ప్రక్రియ ఎదుర్కొంటున్నారు. అలాగే, హీరోయిన్ త్రిషతో విజయ్ బంధంపై పుకార్లు తెగ వెస్తున్నాయి. ఈ విషయాలపై బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ స్పందించారు. విజయ్, త్రిషకు మద్దతునిచ్చారు.
తమిళ చిత్ర పరిశ్రమలో దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. సుమారు 25 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత ఆయన భార్య సంగీత సోర్నలింగం చెన్నై కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

విజయ్ తన కోస్టార్ (నటి) తో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని సంగీత తన పిటిషన్‌లో ఆరోపించిన నేపథ్యంలో హీరోయిన్ త్రిష కృష్ణన్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సామాజిక విమర్శల మధ్య బాలీవుడ్ దర్శక దిగ్గజం విక్రమ్ భట్ ఈ జంటకు మద్దతుగా నిలిచారు.
"వారికి ప్రేమించే హక్కు ఉంది"
సోమవారం (మార్చి 9) తన ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్టర్ విక్రమ్ భట్ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశారు. విజయ్-త్రిషల వ్యక్తిగత స్వేచ్ఛ గురించి గట్టిగా మాట్లాడారు. "ఆన్‌లైన్‌లో వస్తున్న పుకార్లు నిజమో కాదో నాకు తెలియదు. కానీ, ఒకవేళ అవి నిజమైతే, నేను కొన్ని విషయాలు చెప్పక తప్పదు" అని అన్నారు విక్రమ్ భట్.
"రెండు మనసులు కలవనప్పుడు సమాజం కోసం బలవంతంగా ఒక రిలేషన్‌లో బంధీలుగా ఉండటం నరకం కంటే దారుణం. హృదయం (మనసు) ఎప్పుడూ తనకు సంతోషాన్నిచ్చే చోటికే వెళ్తుంది" అని విక్రమ్ భట్ పేర్కొన్నారు.
జడ్జీలుగా మారిపోతామని
మనుషులుగా మనం బలహీనతలను, గుండెకోతను అర్థం చేసుకుంటామని.. కానీ సమూహంగా మారినప్పుడు మాత్రం ఇతరుల మీద తీర్పులు చెప్పే జడ్జీలుగా మారిపోతామని విక్రమ్ భట్ విమర్శించారు.
"విజయ్, త్రిషల విషయంలో నాకు ఒకటి నచ్చింది. వారు దేనినీ దాచడం లేదు.. పాపంలా భయపడటం లేదు. వారి సినిమాలు మనకు సొంతం కావచ్చు. కానీ, వారి వ్యక్తిగత జీవితాలు మనవి కావు" అని విక్రమ్ భట్ ఈ జంటకు సపోర్టింగ్‌గా నిలిచారు.
రూ. 30 కోట్ల చీటింగ్ కేసు
ఇదిలా ఉంటే, ఇటీవలే విక్రమ్ భట్ రూ. 30 కోట్ల చీటింగ్ కేసు ఆరోపణలపై జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఉదయ్‌పూర్‌కు చెందిన ఇందిరా ఐవీఎఫ్ అధినేత డాక్టర్ అజయ్ ముర్దియా ఫిర్యాదుతో 2025 నవంబర్‌లో విక్రమ్ భట్, ఆయన భార్య శ్వేతాంబరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
నాలుగు సినిమాల నిర్మాణానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుని, తమ నుంచి తీసుకున్న రూ. 30 కోట్లను విక్రమ్ భట్ దంపతులు దారి మళ్లించారని ముర్దియా ఆరోపించారు. ఈ నేపథ్యంలో జైలుకెళ్లిన విక్రమ్ భట్ బెయిల్ మీద తిరిగి ఇంటికొచ్చారు.
విజయ్, త్రిషకు సపోర్ట్
రూ. 30 కోట్ల చీటింగ్ కేసు ఉన్న విక్రమ్ భట్ ఇప్పుడు విజయ్, త్రిష బంధాన్ని సపోర్ట్ చేయడంపై నెటిజన్స్ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, మరోవైపు విజయ్ భార్య సంగీత దాఖలు చేసిన పిటిషన్‌లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సంగీత సంచలన ఆరోపణలు
2021 నుంచి విజయ్ తన పట్ల ఉదాసీనంగా ఉంటున్నారని, మానసిక వేదనకు గురిచేస్తున్నారని సంగీత పేర్కొన్నారు. తండ్రి ప్రవర్తన వల్ల తన పిల్లలు జేసన్ సంజయ్, దివ్య సాషాలు కూడా సమాజంలో తలదించుకోవాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ముందడుగు వేసిన విజయ్-త్రిష?
1999లో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగిన వీరి వివాహం ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కడం ఫ్యాన్స్‌ను తీవ్రంగా కలచివేస్తోంది. ఇక మార్చి 5న ఏజీఎస్ ప్రొడక్షన్ అధినేత కల్పతి సురేష్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు విజయ్, త్రిష కలిసి హాజరుకావడం వారి బంధంపై వస్తున్న పుకార్లకు మరింత బలం చేకూర్చింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


