తెలంగాణలో లక్ష మంది విద్యార్థులకు ఫ్రీగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ ట్రైనింగ్

తెలంగాణలో లక్ష మంది విద్యా్ర్థులకు ఫ్రీగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ ట్రైనింగ్ అందించనున్నట్టుగా మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. టాస్క్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్టుగా తెలిపారు.

Published on: Nov 2, 2026, 21:34:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణ ఏఐ, క్లౌడ్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాసంస్థలు లేదా విద్యార్థులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో టాస్క్, ఏడబ్ల్యూఎస్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌కు అనుబంధంగా ఉన్న 643 కళాశాలల విద్యార్థులు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్, జెనరేటివ్ ఏఐలలో పరిశ్రమల ఆధారిత శిక్షణ పొందుతారని తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ లెర్నింగ్ కోసం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కన్సోల్‌ను ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తారు. ఇంజనీరింగ్, సైన్స్ చదువుతున్న విద్యార్థులతో పాటు ఆర్ట్స్, కామర్స్ వంటి నాన్-స్టెమ్ (STEM) కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ప్రత్యేక శిక్షణా కోర్సులు అందిస్తారు.

ఈ ప్రోగ్రామ్‌లో చేరిన విద్యార్థులు ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్ ద్వారా 900కు పైగా డిజిటల్ కోర్సులకు ఒక సంవత్సరం పాటు ఉచిత యాక్సెస్ పొందుతారు. గ్లోబల్ సర్టిఫికేషన్ పరీక్షల కోసం డిస్కౌంట్ వోచర్‌లు కూడా అందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా టెక్నాలజీ నిపుణులతో ఇండస్ట్రీ కనెక్ట్ సెషన్‌లు, హ్యాకథాన్‌లు నిర్వహిస్తారు. ఇవి విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవాన్ని, పరిశ్రమ నిపుణులతో సంభాషించే అవకాశాలను అందిస్తాయి.

శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అర్హులైన విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు టాస్క్ ప్రత్యేక జాబ్ ఫెయిర్‌లను నిర్వహిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇందులో పాల్గొంటున్న కళాశాలల అధ్యాపకులకు ఏఐ, క్లౌడ్ టెక్నాలజీలలో కూడా శిక్షణ ఇవ్వనున్నట్టుగా చెప్పారు.

'విద్యార్థులకు ఏఐ, డేటా ఇంజినీరింగ్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐలో శిక్షణ ఉంటుంది. ప్రత్యేక కోర్సులను అందుబాటులో ఉంటాయి. ఏడాది పాటు 900కు పైగా డిజిటల్ కోర్సులను విద్యార్థులు ఉచితంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు హ్యాకథాన్లు, ఇండస్ట్రీ కనెక్ట్ సెషన్లు నిర్వహిస్తాం. లక్ష మంది యువతకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నైపుణ్యాలను అందించడమే టార్గెట్.' అని శ్రీధర్ బాబు అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More