భవిష్యత్తు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తూ, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థుల కోసం భారీ సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) పరిధిలోని 205 పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న దాదాపు 80 వేల మంది విద్యార్థులకు కృత్రిమ మేధ , డిజిటల్ సేఫ్టీ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ వినూత్న ప్రాజెక్టును టీఎంఆర్ఈఐఎస్, మాస్క్ నెక్స్ట్‌జెన్ ,డాక్సా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (DCPL) సంస్థలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలోకి తీసుకువస్తున్నాయి. ఇందులో గ్లోబల్ ఇంప్లిమెంటేషన్, స్ట్రాటజిక్ పార్ట్నర్‌గా డాక్సా కన్సల్టింగ్ సంస్థ బాధ్యతలు నిర్వర్తించనుంది.
ఆగస్టు 15న ప్రారంభం….
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం 2026 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత సానుకూలమైన అంశం ఏమిటంటే,….దీనివల్ల ప్రభుత్వంపై కానీ, అటు విద్యార్థులపై కానీ ఎలాంటి ఆర్థిక భారం పడదు. సామాజిక బాధ్యతతో కూడిన ఉమ్మడి భాగస్వామ్య విధానంలో భాగంగా ఈ శిక్షణను విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.
మైనారిటీల సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందుకోవడంలో మన విద్యార్థులు ముందంజలో ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.
"కృత్రిమ మేధస్సు అనేది కేవలం ఒక సాంకేతికత కాదు, అది మన భవిష్యత్తు. ప్రపంచాన్ని అత్యంత వేగంగా మారుస్తున్న ఈ ఏఐ విప్లవంలో మైనారిటీ విద్యార్థులు వెనుకబడిపోకూడదనే ఉద్దేశంతోనే టీఎంఆర్ఈఐఎస్ సంస్థల్లో ఈ డిజిటల్ సేఫ్టీ శిక్షణను ప్రవేశపెడుతున్నాం" అని మంత్రి అజహరుద్దీన్ పేర్కొన్నారు.
ఈ మేరకు మాస్క్ నెక్స్ట్‌జెన్ సంస్థతో ప్రభుత్వం మూడేళ్ల కాలపరిమితి గల భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనా ధోరణి పెరగడంతో పాటు రాబోయే రోజుల్లో అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. నేటి తరం పిల్లలు సాంకేతిక రంగంలో కేవలం వినియోగదారులుగా మిగిలిపోకుండా, భవిష్యత్ నాయకులుగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని ఆయన వివరించారు.
{{/usCountry}}ఈ మేరకు మాస్క్ నెక్స్ట్‌జెన్ సంస్థతో ప్రభుత్వం మూడేళ్ల కాలపరిమితి గల భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనా ధోరణి పెరగడంతో పాటు రాబోయే రోజుల్లో అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. నేటి తరం పిల్లలు సాంకేతిక రంగంలో కేవలం వినియోగదారులుగా మిగిలిపోకుండా, భవిష్యత్ నాయకులుగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని ఆయన వివరించారు.
{{/usCountry}}ఈ విద్యా కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు సమాన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మహిళా సాధికారత సాధించాలన్నా, యువతుల ఉపాధి రేటు పెరగాలన్నా సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని మంత్రి అజహరుద్దీన్ అభిప్రాయపడ్డారు. మన బాలికలు అత్యుత్తమ డిజిటల్ విద్యను అభ్యసించి, ఆత్మవిశ్వాసంతో పరిశ్రమల్లో రాణించేలా మార్గం సుగమం చేయడం ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటని ఆయన స్పష్టం చేశారు.
గేమిఫైడ్ విధానంలో ఆధునిక పాఠ్యాంశాలు
ఈ శిక్షణను సరికొత్తగా, విద్యార్థులను ఆకట్టుకునేలా 'గేమిఫైడ్' మరియు స్వీయ-అభ్యాస (Self-learning) డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా బోధించనున్నారు. కేవలం ఏఐ మాత్రమే కాకుండా, డిజిటల్ భద్రత, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్‌షిప్ క్వాలిటీస్, ఇన్నోవేషన్ వంటి ఇంటరాక్టివ్ మాడ్యూల్స్ ఇందులో ఉంటాయి. దీనివల్ల విద్యార్థులు ఇంటర్నెట్ ప్రపంచంలో సురక్షితంగా ఉంటూనే, కెరీర్‌కు అవసరమైన నైపుణ్యాలను సులువుగా నేర్చుకోగలుగుతారు.