Hyderabad Traffic Police Summer Camp : హైదరాబాద్ నగర పోలీసులు ప్రజలతో మమేకమవడానికి, ముఖ్యంగా భావి భారత పౌరులైన చిన్నారుల్లో క్రమశిక్షణ పెంపొందించడానికి మరో అడుగు ముందుకు వేశారు. 'సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్'లో భాగంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ఒక అద్భుతమైన అవకాశాన్ని చిన్నారుల ముందుకు తెచ్చింది. హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (TTI)లో ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది.
తేదీలు…. నేర్పించే అంశాలు

ఈ శిక్షణ శిబిరం కేవలం రోడ్డు భద్రతకే పరిమితం కాకుండా, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేలా డిజైన్ చేశారు. మే 11, 2026 నుంచి మే 16, 2026 వరకు వారం రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఈ తరగతులు జరుగుతాయి. ఇందులో నేర్పించే ప్రధాన అంశాలు ఇవే:
- రోడ్డు భద్రత - ట్రాఫిక్ అవగాహన: నిబంధనల పట్ల చిన్నతనం నుంచే బాధ్యత పెంచడం.
- ఆత్మరక్షణ (Self Defence): అత్యవసర పరిస్థితుల్లో తమను తాము కాపాడుకునే మెళకువలు.
- కళలు & సృజనాత్మకత: డ్యాన్స్, మ్యూజిక్, పెయింటింగ్ మరియు కార్టూనింగ్.
- నైపుణ్యాల అభివృద్ధి: చేతిరాత మెరుగుపరచుకోవడం , వ్యక్తిత్వ వికాసం.
- జీవిత రక్షణ: ప్రాథమిక అత్యవసర వైద్య చికిత్స (Basic Life Support) పై అవగాహన.
రిజిస్ట్రేషన్ వివరాలు….
ఈ శిబిరంలో పాల్గొనేందుకు 6వ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుండి 10వ తరగతి చదువుతున్న బాలబాలికల వరకు అందరూ అర్హులు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 3, 2026 (ఆదివారం) నుండే ప్రారంభమవుతుంది. సీట్లు పరిమితంగా ఉన్నందున ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు వెంటనే తమ పిల్లల పేర్లను నమోదు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఈ కార్యక్రమం గురించి ఏదైనా సందేహాలుంటే గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్స్పెక్టర్ జి. హరీష్ ని (సెల్: 8712660655) లేదా కార్యాలయ అసిస్టెంట్‌ను (9848063345) సంప్రదించవచ్చు.
{{/usCountry}}ఈ కార్యక్రమం గురించి ఏదైనా సందేహాలుంటే గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్స్పెక్టర్ జి. హరీష్ ని (సెల్: 8712660655) లేదా కార్యాలయ అసిస్టెంట్‌ను (9848063345) సంప్రదించవచ్చు.
{{/usCountry}}ఈ శిబిరానికి వచ్చే చిన్నారులకు రవాణా సౌకర్యాన్ని (Transportation) తల్లిదండ్రులే స్వయంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పోలీసులకు, ప్రజలకు మధ్య దూరాన్ని తగ్గించి, ఫ్రెండ్లీ పోలీసింగ్ వాతావరణాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.