ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో భారీగా నిధులు పక్కదారి పట్టిన వ్యవహారంలో దేవాదాయ శాఖ అధికారులు తీవ్ర చర్యలు తీసుకున్నారు. ఆలయ నిధుల దుర్వినియోగంపై సాగిన విచారణ అనంతరం మొత్తం నలుగురు ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇందులో ఒక ప్రధాన నిందితుడిని ఉద్యోగం నుంచి డిస్మిస్, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు సూపర్‌వైజరీ స్థాయి అధికారులకు వార్షిక ఇంక్రిమెంట్లు నిలిపివేస్తూ జరిమానా విధించారు.

ఆలయ నిధుల మళ్లింపులో ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ అసిస్టెంట్ కె. శ్రీనివాసాచారిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఈవో ఎస్. అంజనా రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసాచారి ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నారు. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, మొత్తం 12 రకాల తీవ్రమైన ఆరోపణలతో చార్జ్‌షీట్ నమోదు చేశారు. శాఖాపరమైన సమగ్ర విచారణలో ఆయనపై వచ్చిన అన్ని ఆరోపణలు రుజువయ్యాయి. కొండగట్టు దేవస్థానానికి చెందిన రూ. 49.29 లక్షల నిధులను ఆయన దుర్వినియోగానికి పాల్పడినట్లు విచారణలో స్పష్టంగా తేలింది.
కింది స్థాయి సిబ్బంది నిధుల దుర్వినియోగానికి పాల్పడుతుంటే పర్యవేక్షించడంలో, రికార్డులను సరిచూడడంలో ఘోరంగా విఫలమైనందుకు ముగ్గురు సూపర్‌వైజరీ స్థాయి అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. వీరికి శిక్షగా రెండు వార్షిక ఇంక్రిమెంట్లను నిలిపివేస్తూ ఇఓ ఆదేశాలు ఇచ్చారు.
కొండగట్టు ఆలయ మాజీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ప్రస్తుతం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆలయ రికార్డులను సరిచూడడంలో, కింది సిబ్బందిని పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఈయన రెండు ఇంక్రిమెంట్లను నిలిపివేశారు.
జి. శ్రీనివాస్ శర్మ ఆలయ మాజీ సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఈయన, కింది స్థాయి సిబ్బందిని సరిగ్గా మానిటరింగ్ చేయకపోవడం వల్ల ఆర్థిక అక్రమాలకు తావు ఇచ్చినట్లయిందని భావించి రెండు ఇంక్రిమెంట్ల కోత విధించారు.
{{/usCountry}}జి. శ్రీనివాస్ శర్మ ఆలయ మాజీ సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఈయన, కింది స్థాయి సిబ్బందిని సరిగ్గా మానిటరింగ్ చేయకపోవడం వల్ల ఆర్థిక అక్రమాలకు తావు ఇచ్చినట్లయిందని భావించి రెండు ఇంక్రిమెంట్ల కోత విధించారు.
{{/usCountry}}మరో సూపరింటెండెంట్ సునీల్ కుమార్ కూడా సిబ్బంది పర్యవేక్షణ, ఆలయ రికార్డుల తనిఖీల్లో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు విచారణలో తేలడంతో ఆయన రెండు ఇంక్రిమెంట్లను నిలిపివేస్తూ ఈఓ ఉత్తర్వులు ఇచ్చారు.
మొత్తం విచారణ ప్రక్రియలో ప్రస్తుత అంశానికి సంబంధించి రూ. 14.49 లక్షల నిధుల పక్కదారి పట్టగా, శ్రీనివాసాచారిపై జరిగిన చర్యల ద్వారా మొత్తం రూ. 49.29 లక్షల మేర నిధుల అక్రమార్జన, దుర్వినియోగం జరిగినట్లు దేవాదాయ శాఖ విచారణలో అధికారికంగా నిర్ధారణ అయ్యింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే కింది స్థాయి సిబ్బందికి ఈ అవకతవకలకు పాల్పడే వెసులుబాటు లభించిందని అధికారులు స్పష్టం చేశారు.