...
...
Next Story

Future City Police : 244 టూ వీలర్స్ వేలం.. ఈ లింక్ క్లిక్ చేసి వెహికల్ డీటెయిల్స్ చూడండి

Future City Police : ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కీలక ప్రకటన చేసింది. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న 244 టూ వీలర్స్‌ను వేలం వేయనున్నట్టుగా ప్రకటించింది.

Published on: Nov 5, 2026, 15:24:03 IST
Advertisement

మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిలిపి ఉంచిన, ఎవరూ క్లెయిమ్ చేయని 244 వాహనాలను వేలం వేయనున్నట్లు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రకటించింది. ఈ వాహనాలకు సంబంధించి యజమానులు లేదా చట్టపరమైన హక్కుదారులు తమ యాజమాన్యాన్ని నిరూపించే పత్రాలను సమర్పించడానికి ఆరు నెలల గడువు ఇచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ వాహనాల్లో 80 హీరో ప్యాషన్ ప్లస్, 47 హీరో గ్లామర్, 37 హీరో స్ప్లెండర్, 58 బజాజ్ పల్సర్, 18 హోండా షైన్, నాలుగు రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిళ్లు ఉన్నాయి. పోలీసుల సమాచారం ప్రకారం 'ఫ్యూచర్ సిటీ పోలీస్ యాక్ట్, 2026'లోని సెక్షన్లు 6(2), 7, అలాగే హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్‌లోని సెక్షన్లు 39, 40, 41 ప్రకారం, ఈ వాహనాలను ఆన్‌లైన్ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తారు.

వాహన యజమానులు, చట్టపరమైన హక్కుదారులు, రుణం కోసం తాకట్టు హక్కులు కలిగిన వారు, ఈ నోటీసు ప్రచురించిన తేదీ నుండి ఆరు నెలల లోపు సరైన యాజమాన్య పత్రాలు, ఆధారాలతో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణీత గడువులోగా ఎటువంటి సరైన క్లెయిమ్ లేదా అభ్యంతరాలు రాకపోతే, చట్టపరమైన నిబంధనల ప్రకారం ఈ వాహనాలను వేలం వేస్తారు.

వాహనాల వివరాలు, క్లెయిమ్ ప్రక్రియ గురించి తెలుసుకోవడానికి, ఫ్యూచర్ సిటీలోని సి.ఎ.ఆర్ (CAR) హెడ్‌క్వార్టర్స్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఎన్. సుబ్రహ్మణ్యంను 8712670664 అనే నంబర్‌లో సంప్రదించవచ్చు. మొత్తం 244 వాహనాల జాబితాను తెలంగాణ పోలీస్ వెబ్‌సైట్ https://www.tspolice.gov.in/future-city లో చూడవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks