మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.
కాంట్రాక్టర్ నుంచి రూ.60 వేలు లంచం... గద్వాల విద్యుత్ అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
గద్వాల ఏడీఈ అన్నారపు రమేష్ బాబును రూ.60 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బిల్లు మంజూరు కోసం డబ్బు డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
గద్వాల సబ్‌డివిజన్ టీజీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) అన్నారపు రమేష్ బాబు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. రూ.60,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా మహబూబ్‌నగర్ ఏసీబీ అధికారులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

బిల్లు ప్రాసెసింగ్ కోసం డబ్బులు డిమాండ్….
ఫిర్యాదుదారు, ఆయన సహ కాంట్రాక్టర్ చేసిన పనులకు సంబంధించిన రూ.12,62,070 బిల్లును మంజూరు చేసి…. ప్రాసెస్ చేసేందుకు ఏడీఈ రమేష్ బాబు ఈ లంచం డిమాండ్ చేశారు. ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఫిర్యాదుదారుతో ఆయన మాట్లాడారు. లంచం సొమ్ము రూ.60,000ను తన కారు డ్యాష్‌బోర్డుపై పెట్టాలని సూచించారు. అధికారి చెప్పినట్లే ఫిర్యాదుదారు ఆ మొత్తాన్ని కారు డ్యాష్‌బోర్డుపై ఉంచారు.
ఏడీఈ రమేష్ బాబు వద్ద నుంచి రూ.60,000 లంచం సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. AP07CZ4705 రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న ఆయన కారు డ్యాష్‌బోర్డుపై జరిపిన రసాయన పరీక్షలో పాజిటివ్ ఫలితం వచ్చింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ…. విధి నిర్వహణలో నిజాయతీ లేకుండా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి రమేష్ బాబును అరెస్ట్ చేశారు.
నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారు వివరాలను గోప్యంగా ఉంచారు. లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగితే ప్రజలు వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు. వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), ఎక్స్ (@Telangana ACB) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో ఏసీబీ క్యూఆర్ కోడ్‌ను ప్రదర్శించారని….. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది.

E-Paper
