...
...
Next Story

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మందమర్రిలో జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్, స్టైపండ్ కూడా!

మంచిర్యాల జిల్లా మందమర్రిలో జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభమైంది. విద్యార్థులకు మరో గుడ్‌న్యూస్ ఏంటంటే.. స్టైపండ్ కూడా అందుతుంది.

Published on: Jun 10, 2026 05:36 PM IST
Advertisement

యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో మందమర్రిలో ATC (Advanced Training Center) సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు, భాషా శిక్షణ, ప్రత్యేక కోర్సులు అందించనున్నారు. యువతకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా టామ్‌కామ్ ఆధ్వర్యంలో మందమర్రిలో జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభమైంది. విదేశాల్లో, ముఖ్యంగా జర్మనీలో ఉద్యోగాలు, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ శిక్షణ కేంద్రం కీలకంగా మారనుంది.

జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం
జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం

జర్మన్ భాషపై పట్టు సాధించడం ద్వారా విద్యార్థులు, యువత ప్రపంచ స్థాయి ఉద్యోగ మార్కెట్‌లో పోటీ పడే అవకాశం పొందుతారు. భాషా నైపుణ్యాలతో పాటు ఇంటర్వ్యూ స్కిల్స్, కమ్యూనికేషన్, విదేశీ ఉద్యోగాల కోసం అవసరమైన మార్గదర్శకత్వం కూడా అందించనున్నారు.

మందమర్రిలో ఏర్పాటు చేసిన ఏటీసీ సెంటర్‌లో యువతకు మెరుగైన శిక్షణ అందించేందుకు రెండు బ్యాచ్‌లలో తరగతులు నిర్వహించనున్నారు. ఎక్కువ మంది యువత ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా ఉదయం, సాయంత్రం బ్యాచ్‌లుగా శిక్షణ కార్యక్రమాలను చేపట్టనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించాలనే లక్ష్యంతో ఏటీసీ సెంటర్ల ఏర్పాటు చేపట్టామని మంత్రి వివేక్ అన్నారు. రాష్ట్రానికి సుమారు 120 ఏటీసీ సెంటర్లు అవసరం ఉన్నప్పటికీ, ప్రస్తుతం 65 సెంటర్లు మంజూరయ్యాయని చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా దశలవారీగా మరిన్ని సెంటర్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ప్రతి నియోజకవర్గంలోని యువతకు నాణ్యమైన శిక్షణ అందించడమే ప్రభుత్వ సంకల్పమని వివేక్ వెంకటస్వామి చెప్పారు. జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులకు భారీ డిమాండ్ ఉందని, అక్కడి ఉద్యోగ వ్యవస్థలో సాధారణంగా వారానికి సుమారు 32 నుంచి 40 గంటల పని విధానం అమలులో ఉంటుందన్నారు. తక్కువ పని గంటలు, మెరుగైన వేతనాలు, ఉద్యోగ భద్రత కారణంగా ప్రపంచవ్యాప్తంగా యువత జర్మనీ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు.

TOMCOM ద్వారా అందిస్తున్న రూ.2,000 స్టైపండ్ తోపాటు, కాకా వెంకటస్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరో రూ.1,000 ప్రోత్సాహకంగా అందజేస్తామని మంత్రి వివేక్ వెల్లడించారు. మొత్తం రూ.3,000 ఆర్థిక సహాయంతో విద్యార్థులు శిక్షణపై మరింత దృష్టి పెట్టగలుగుతారన్నారు. ఆర్థిక పరిస్థితులు విద్యకు, నైపుణ్యాభివృద్ధికి అడ్డంకిగా మారకూడదన్నదే తమ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల యువత కూడా అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe