GHMC : నగరవాసులకు శుభవార్త - ఆస్తి పన్నుపై డిస్కౌంట్, ఈ వన్ టైమ్ ఛాన్స్ మిస్ చేసుకోకండి...!

ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ శుభవార్త చెప్పింది. పెండింగ్‌ బకాయిలు ఈనెల 31వ తేదీలోగా క్లియర్ చేస్తే… వడ్డీపై 90 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Published on: Mar 13, 2026 12:45 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

cw ఆస్తి పన్నుదారులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. తాజా ఆర్థిక సంవత్సరానికి (2025-26) సంబంధించిన పెండింగ్‌ బకాయిలను మార్చి 31వ తేదీలోపు క్లియర్ చేస్తే రాయితీ ఇవ్వనుంది. వడ్డీపై 90 శాతం రాయితీ(డిస్కౌంట్) ఇవ్వనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆస్తి పన్ను చెల్లింపుదారులకు GHMC శుభవార్త
ఆస్తి పన్ను చెల్లింపుదారులకు GHMC శుభవార్త

వడ్డీపై 90 శాతం డిస్కౌంట్…

ఆస్తిపన్ను చెల్లింపుదారులు జీహెచ్‌ఎంసీ అధికారిక వెబ్‌సైట్ ghmc.gov.in ద్వారా లేదా MyGHMC , MyCURE వంటి మొబైల్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా చెల్లింపులు చేసుకోవచ్చు. మీ-సేవా కేంద్రాలు , సిటిజన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి కూడా బకాయిలు చెల్లించి ఈ 90 శాతం వడ్డీ రాయితీని పొందవచ్చని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.

చాలా మంది ఆస్తి పన్నులను క్లియర్ చేయకుండా ఉంటారు. ఇది కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి… చాలా డబ్బులు కట్టాల్సిన పరిస్థితికి దారితీస్తుంది. అయితే ఇలాంటి వారు ఈ ఓటీఎస్(వన్ టైమ్ సెటిల్ మెంట్) ద్వారా పేరుకుపోయిన బకాయిలను తక్కువ డబ్బులు చెల్లించి క్లియర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

అయితే ప్రభుత్వం నిర్దేశించిన మార్చి 31వ తేదీన గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఇటువంటి రాయితీలు ఉండకపోవచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు స్పష్టం చేసింది. త్వరితగతిన పన్ను కట్టాలని సూచిస్తున్నారు. సకాలంలో పన్నులు చెల్లించడం ద్వారా నగర ప్రజలు తమ బాధ్యతను నెరవేర్చడమే కాకుండా, నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను - వెబ్ సైట్లు:

  • http://ghmc.gov.in
  • మై క్యూఆర్ యాప్
  • మీసేవా కేంద్రా
  • సిటిజన్ సర్వీస్ సెంటర్స్
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More