పాత పరుపులు, ఫర్నిచర్ వదిలించుకోవాలా? ఇకపై ఫ్రీగా డోర్‌స్టెప్ పికప్ సర్వీస్

ఇంట్లోని పాత పరుపులు, ఫర్నిచర్ తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేస్తుంటారు చాలా మంది. కానీ ఇకపై మీ ఇంటికి వచ్చి ఉచితంగా డోర్‌స్టెప్ పికప్ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది.

Published on: Jul 6, 2026, 15:48:53 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నగరాన్ని మరింత పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) సరికొత్త ముందడుగు వేసింది. నగరవాసులు తమ ఇళ్లలోని పాత పరుపులు, విరిగిన ఫర్నిచర్ వంటి పెద్ద వ్యర్థాలను సులభంగా వదిలించుకునేందుకు సరికొత్త డోర్‌స్టెప్ పికప్(ఇంటి వద్దకే వచ్చి సేకరించే) సేవలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్మూలన, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

జీహెచ్ఎంసీ డోర్ స్టేప్ సర్వీస్
జీహెచ్ఎంసీ డోర్ స్టేప్ సర్వీస్

గతంలో ఈ-వేస్ట్ (ఎలక్ట్రానిక్ వ్యర్థాలు), దేవుడి పటాలు-పూజా సాగ్రి వంటి వాటిని విజయవంతంగా సేకరించిన జీహెచ్‌ఎంసీ, ఇప్పుడు భారీ గృహ వ్యర్థాలపై దృష్టి సారించింది.

నగర ప్రజలు తమ ఇంట్లోని పాత పరుపులు లేదా ఫర్నిచర్‌ను తొలగించాలనుకుంటే.. జీహెచ్‌ఎంసీ త్వరలో అందుబాటులోకి తేనున్న ప్రత్యేక క్యూఆర్ కోడ్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది. ప్రజలు తమ ప్రస్తుత లొకేషన్‌ను షేర్ చేసి, వస్తువులకు సంబంధించిన ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి.

ఆ వెంటనే జీహెచ్‌ఎంసీ ద్వారా లైసెన్స్ పొందిన అధికారిక బృందాలు నేరుగా వారి ఇంటికే వచ్చి ఆ వస్తువులను ఉచితంగా సేకరిస్తాయి.

సాధారణంగా నగరంలో చాలామంది పాత పరుపులను, సోఫాలను, విరిగిన కుర్చీలను రాత్రికి రాత్రే రోడ్ల పక్కన, బహిరంగ ప్రదేశాలలో లేదా మురికి కాలువల సమీపంలో పారేస్తున్నారు. దీనివల్ల వర్షాకాలంలో వరద నీరు ప్రవహించే బాక్స్ డ్రైన్లు పూడుకుపోయి, రోడ్లపై నీరు నిలిచిపోతోంది. ఈ సమస్యకు అడ్డుకట్ట వేయడంతో పాటు, నగర రూపురేఖలను మార్చడానికి జీహెచ్‌ఎంసీ ఈ వినూత్న ప్రణాళికను సిద్ధం చేసింది.

ఈ సరికొత్త కార్యక్రమం ద్వారా డంపింగ్ యార్డులకు వెళ్లే వ్యర్థాల పరిమాణం గణనీయంగా తగ్గుతుందని అధికారులు తెలిపారు. పాత వస్తువుల నుండి విలువైన వనరులను సేకరించి రీసైక్లింగ్ చేయడం ద్వారా సర్క్యులర్ ఎకానమీకి తోడ్పాటు లభిస్తుంది.

హైదరాబాద్‌ను మరింత స్వచ్ఛంగా, పచ్చదనంతో కూడిన సుస్థిర నగరంగా మార్చడానికి నగర ప్రజలంతా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేసింది. ఈ డోర్‌స్టెప్ పికప్ సేవలు అధికారికంగా ఎప్పటి నుండి ప్రారంభమవుతాయనే తేదీని అధికారులు త్వరలోనే వెల్లడించనున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More