తెలంగాణలో కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తాజాగా ఆర్టీసీ జేఏసీ (JAC) నేతలతో మంత్రుల కమిటీ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రాష్ట్ర సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నాయకులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అధికారులతో కలిసి సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.

కార్మికుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. దీంతో రోడ్లపై బస్సులు నడుస్తున్నాయి.
ఈ చర్చల అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరాలను వెల్లడించారు.
ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు
ఆర్టీసీ కార్మికులకు 11 శాతం పీఆర్‌సీ ప్రకటించింది ప్రభుత్వం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న యూనియన్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అంగీకరించింది.
చర్చలు ఫలించడంతో డ్రైవర్లు, కండక్టర్లు వెంటనే విధుల్లోకి చేరాలని, బస్సులు యథావిధిగా నడపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. 'ఆర్టీసీ మన సంస్థ.. అందులోని కుటుంబాలు మనవి. వారి సమస్యలను పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. సుదీర్ఘ చర్చల తర్వాత పీఆర్‌సీతో పాటు ఇతర డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకున్నాం.' అని భట్టి విక్రమార్క అన్నారు.
కార్మికుడు శంకర్ గౌడ్ మరణం అత్యంత బాధాకరమని భట్టి విక్రమార్క అన్నారు. సమస్యలు ఎంత క్లిష్టమైనవైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప ప్రాణాలు తీసుకోవడం ఎవరికీ శ్రేయస్కరం కాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొన్న చేదు అనుభవాలు పునరావృతం కాకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ఇక్కడ ఎవరూ శత్రువులు కాదన్నారు. పేదలకు, మహిళలకు ప్రధాన రవాణా సాధనమైన ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఆర్టీసీకి సంబంధించిన పాలనాపరమైన, విధానపరమైన అంశాలపై సానుకూల దృక్పథంతో నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి, సంస్థను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
హర్షం వ్యక్తం చేసిన జేఏసీ నేతలు
{{/usCountry}}ఆర్టీసీకి సంబంధించిన పాలనాపరమైన, విధానపరమైన అంశాలపై సానుకూల దృక్పథంతో నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి, సంస్థను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
హర్షం వ్యక్తం చేసిన జేఏసీ నేతలు
{{/usCountry}}ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ జేఏసీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. 2019 నుంచి ఆర్టీసీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని, ఎన్నికల నిర్వహణ నిర్ణయం గొప్ప ముందడుగు అని కొనియాడారు. 'ప్రభుత్వం మా సమస్యలపై సానుకూలంగా స్పందించింది, కాబట్టి కార్మికులందరూ ధర్నా విరమించి తక్షణమే విధుల్లోకి చేరాలి.; అని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.
దీంతో గత మూడు రోజులుగా నిలిచిపోయిన బస్సు సర్వీసులు తిరిగి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి.