...
...
Next Story

ఈ రూట్‌లలో వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. టికెట్ల ధరలపై TGSRTC స్పెషల్ డిస్కౌంట్!

ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. రాజధాని, గరుడ ప్లస్, డిలక్స్, సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీపై డిస్కౌంట్లను ప్రకటించింది.

Published on: Dec 15, 2025, 11:50:25 IST
Advertisement

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) హైదరాబాద్‌తోపాటుగా పలు ప్రాంతాలకు నడిపే సర్వీసుల టికెట్ ధరలపై డిస్కౌంట్లు ప్రకటించింది. సంక్రాంతి సమయంలో ఈ రూట్లలో వెళ్లే ప్రయాణికులకు ఈ తగ్గింపు ఎంతగానో ఉపయోగపడనుంది. ఎక్కువ ప్రయాణం చేయండి, తక్కువ పే చేయండి అంటూ టీజీఎస్ఆర్టీసీ చెబుతోంది. స్పెషల్ డిస్కౌంట్లు ఉపయోగించుకోవాలని అంటోంది.

తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణ ఆర్టీసీ

హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే అనేక బస్సులపై ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి. సంక్రాంతికి వెళ్లడం, తిరిగి వచ్చే ప్రయాణికులకు ఈ డిస్కౌంట్లు చాలా ఉపయోగపడతాయి. రాజధాని, గరుడ ప్లస్‌పై 10 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది టీజీఎస్ఆర్టీసీ. అలాగే డిలక్స్, సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీపై 15 శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ బస్సులు పలు రూట్లలో వెళ్లనున్నాయి.

డిస్కౌంట్లు అందించే రూట్లు

కోదాడ విజయవాడ, హైదరాబాద్-రాజమండ్రి వయా విజయవాడ, హైదరాబాద్-తాడేపల్లిగూడెం, హైదరాబాద్-తణుకు, హైదరాబాద్-రావులపాలెం, హైదరాబాద్-మండపేట, హైదరాబాద్-రామచంద్రాపురం, విజయవాడ-రాజమండ్రి, విజయవాడ-తాడేపల్లిగూడెం, విజయవాడ-తణుకు, విజయవాడ-కాకినాడ, విజయవాడ-రావులపాలెం, విజయవాడ-మండపేట, విజయవాడ-రామచంద్రాపురం, విజయవాడ-అమలాపురం, హైదరాబాద్-అన్నవరం వయా ఖమ్మం, విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ-అన్నవారం, విజయవాడ-తుని, హైదరాబాద్-అద్దంకి, హైదరాబాద్-కావలి, హైదరాబాద్-కనిగిరి, తిరుపతి-నెల్లూరు, తిరుపతి-ఒంగోలు, తిరుపతి-కావలి, కర్నూలు-బెంగళూరు, అనంతపురం-బెంగళూరు, కర్నూలు-అనంతపూరం, తిరుపతి-కర్నూలు, తిరుపతి-కడప, హైదరాబాద్-వినుకొండ, హైదరాబాద్-దర్శి, హైదరాబాద్-పొదిలి వయా మార్కాపురం, హైదరాబాద్-పొదిలి వయా వినుకొండ, హైదరాబాద్-మైదుకూరు.

ఈ బస్సు డిస్కౌంట్ సౌకర్యాన్ని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ కోరింది. టికెట్లను tgsrtcbus.inలో బుక్ చేసుకోవాలని వెల్లడించింది.

టీ24 టికెట్ల రేట్లు తగ్గింపు

హైదరాబాద్ నగర పరిధిలో తిరగాలి అనుకునేవారికి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి, క్రిస్మస్ పండుగలను దృష్టిలో పెట్టుకుని.. కొత్త సిటీ బస్సులను నడిపిస్తోంది. సర్వీసులను పెంచుతోంది. అంతేకాదు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆఫర్స్ ప్రకటిస్తోంది. టీ24 టికెట్ల రేట్ల తగ్గించింది. ఈ టికెట్ ద్వారా 24 గంటలు సిటీలో హాయిగా తిరగొచ్చు. టీ24 టికెట్ ధర పెద్దలకు 150 ఉండగా 130 చేసింది. మహిళలు, సీనియర్ సిటిజన్ల టికెట్ ధరను రూ.110గా అందిస్తోంది. పిల్లలకు టీ24 టికెట్ ధరను రూ.90కి తగ్గించింది. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ అధికారులు ప్రకటన విడుదల చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe