రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కార్యక్రమానికి రూపకల్పన చేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా ప్రస్తుతం అందిస్తున్న ఉచిత బియ్యంతో పాటు ప్రతి ఇంటా ప్రతినిత్యం వినియోగించే ఆరు ముఖ్యమైన నిత్యావసర సరుకులను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయడానికి ప్రణాళికలు వేగవంతం చేసింది.

ప్రస్తుతం రేషన్ షాపుల్లో కేవలం బియ్యం మాత్రమే లభిస్తుండటంతో, వంటకు కావాల్సిన మిగిలిన సరకుల కోసం పేద ప్రజలు బహిరంగ మార్కెట్‌పై ఆధారపడి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ భారాన్ని తగ్గించేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనల్లోని ముఖ్య సరుకులు చూసుకుంటే.. కందిపప్పు, వంట నూనె (పామాయిల్), చింతపండు, కారంపొడి, చక్కెర, గోధుమపిండి అందిస్తారు.
ఈ సరుకులను రాయితీ ధరలకు లేదా ఉచితంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించడం ద్వారా ప్రతి నిరుపేద కుటుంబానికి నెలవారీ బడ్జెట్లో గణనీయమైన ఆర్థిక ఊరట లభించనుంది. ప్రస్తుత పౌరసరఫరాల శాఖ గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల వివరాలు చూస్తే.. మొత్తం ఆహార భద్రత రేషన్ కార్డులు దాదాపు 1.06 కోట్లుగా ఉన్నాయి. మొత్తం లబ్ధిదారులు సుమారు 3.42 కోట్ల మంది.
వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు, కరువు ప్రభావం, పెరిగిన వ్యయం దృష్ట్యా రాష్ట్రంలోని మెజారిటీ జనాభాకు సంపూర్ణ ఆహార భరోసా కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఈ బృహత్తర పథకాన్ని క్షేత్రస్థాయిలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అమలు చేయడానికి పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు:
ప్రతి కార్డుదారునికి లేదా ప్రతి లబ్ధిదారునికి ఏ పరిమాణంలో (కిలోలు/లీటర్లలో) సరుకులు అందించాలి? నాణ్యతా ప్రమాణాలపై కసరత్తు జరుగుతోంది. 6 రకాల సరుకుల పంపిణీ వల్ల రాష్ట్ర ఖజానాపై పడే అదనపు బడ్జెట్ భారంపై చర్చ జరుగుతోంది. మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా కాపాడేందుకు, సరుకులను ముందుగానే బల్క్ పద్ధతిలో సేకరించి జిల్లాల్లోని సివిల్ సప్లైస్ గొడౌన్లకు తరలించే అవకాశం ఉంది.
{{/usCountry}}ప్రతి కార్డుదారునికి లేదా ప్రతి లబ్ధిదారునికి ఏ పరిమాణంలో (కిలోలు/లీటర్లలో) సరుకులు అందించాలి? నాణ్యతా ప్రమాణాలపై కసరత్తు జరుగుతోంది. 6 రకాల సరుకుల పంపిణీ వల్ల రాష్ట్ర ఖజానాపై పడే అదనపు బడ్జెట్ భారంపై చర్చ జరుగుతోంది. మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా కాపాడేందుకు, సరుకులను ముందుగానే బల్క్ పద్ధతిలో సేకరించి జిల్లాల్లోని సివిల్ సప్లైస్ గొడౌన్లకు తరలించే అవకాశం ఉంది.
{{/usCountry}}యాసంగి సీజన్లో పంటల సాగు సరళి, నీటి లభ్యత, వర్షాభావ పరిస్థితులను నిశితంగా పరిశీలించిన తర్వాత పంపిణీ ప్రక్రియను ముమ్మరం చేయాలని సర్కారు భావిస్తోంది. సరఫరా వ్యవస్థను బలోపేతం చేసి, ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా వచ్చే సంక్రాంతి నాటికి ఈ 6 రకాల నిత్యావసరాలను నేరుగా రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారుల చేతికి అందించేలా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది.