భవన నిర్మాణాలకు సంబంధించి టీడీఆర్ వినియోగానికి సంబంధించిన నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు ‘తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012’కి సంబంధించి కీలక సవరణలు చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది.
పలు మార్పులు…

మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ నుంచి తాజాగా జారీ అయిన జీవో ప్రకారం…. 21 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తుతో నిర్మించనున్న వాటిని హైరైజ్ భవనాలుగా గుర్తిస్తారు. 750 చ.మీ నుంచి 2000 చ.మీలు ఉన్న స్థలంలో 18-21 మీటర్ల భవనాలు నిర్మించాలంటే టీడీఆర్ వినియోగం తప్పనిసరి. నాన్ హైరైజ్ భవనాలకు టీడీఆర్ వినియోగంతో సెట్‌బ్యాక్ సడలింపు ఇచ్చారు. (జీవో ఎంఎస్ నం. 95) ఉత్తర్వులు జారీ చేసింది.
40 ఫీట్ రోడ్ వద్ద 3 అదనపు అంతస్తులకు ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. 60 ఫీట్ రోడ్ వద్ద 4 అదనపు అంతస్తులు నిర్మించుకోవచ్చు. అంతేకాకుండా…. 80 ఫీట్ రోడ్ వద్ద 5 అదనపు అంతస్తులకు అనుమతి ఇచ్చింది. 10 అంతస్తులకు పైగా భవనాల్లో టీడీఆర్ వినియోగాన్ని తప్పనిసరి చేసింది.
- 2000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో…. 40 అడుగుల రోడ్డు వద్ద 3 అదనపు అంతస్తుల వరకు అనుమతించవచ్చు.
- 60 అడుగుల రోడ్డు ఉన్న ప్లాట్లలో 4 అదనపు అంతస్తుల వరకు అనుమతి ఉంటుంది.
- 80 అడుగుల వద్ద ఉన్న ప్లాట్లలో 5 అదనపు అంతస్తుల వరకు అనుమతి ఉంటుంది. TDR వినియోగం మరియు ఫైర్, ఎయిర్‌పోర్ట్ నిబంధనలకు లోబడి ఉండాలి
- 10 నుండి 20 అంతస్తుల మధ్య ఉన్న హై-రైజ్ భవనాలకు, 10వ అంతస్తు పైన ఉన్న మొత్తం బిల్ట్-అప్ ఏరియాలో 3 శాతం వరకు TDR వినియోగించాలి.
- 20 అంతస్తుల కంటే ఎక్కువ ఉన్న భవనాలకు…. 20వ అంతస్తు పైన ఉన్న ఏరియాలో 5 శాతం వరకు TDR వినియోగించాలి.
- భవన నిర్మాణ అనుమతి (Building Permission) ఇచ్చే సమయంలో 50 శాతం TDR సమర్పించాలి.
- మిగిలిన 50 శాతం TDR ను ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (OC) ఇచ్చే ముందు సమర్పించాలి.
వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం TDR(Transferable Development Rights) వినియోగాన్ని క్రమబద్ధీకరించినట్లు మున్సిపల్ శాఖ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. భవన నిర్మాణ నిబంధనలలో వెసులుబాటును పెంపొందించడానికి ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొంది.
{{/usCountry}}వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం TDR(Transferable Development Rights) వినియోగాన్ని క్రమబద్ధీకరించినట్లు మున్సిపల్ శాఖ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. భవన నిర్మాణ నిబంధనలలో వెసులుబాటును పెంపొందించడానికి ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొంది.
{{/usCountry}}