Telangana Building Rules : బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు - తాజా సవరణలు తెలుసుకోండి

Telangana Building Rules : బిల్డింగ్ నిర్మాణ  రూల్స్‌లో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. TDR వినియోగంపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012 లో పలు సవరణలు చేసి.. ఉత్తర్వులు ఇచ్చింది.

Published on: Mar 22, 2026, 13:16:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భవన నిర్మాణాలకు సంబంధించి టీడీఆర్ వినియోగానికి సంబంధించిన నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు ‘తెలంగాణ బిల్డింగ్‌ రూల్స్‌ 2012’కి సంబంధించి కీలక సవరణలు చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది.

బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు (istock image)
బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు (istock image)

పలు మార్పులు…

మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ నుంచి తాజాగా జారీ అయిన జీవో ప్రకారం…. 21 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తుతో నిర్మించనున్న వాటిని హైరైజ్‌ భవనాలుగా గుర్తిస్తారు. 750 చ.మీ నుంచి 2000 చ.మీలు ఉన్న స్థలంలో 18-21 మీటర్ల భవనాలు నిర్మించాలంటే టీడీఆర్‌ వినియోగం తప్పనిసరి. నాన్‌ హైరైజ్‌ భవనాలకు టీడీఆర్‌ వినియోగంతో సెట్‌బ్యాక్‌ సడలింపు ఇచ్చారు. (జీవో ఎంఎస్ నం. 95) ఉత్తర్వులు జారీ చేసింది.

40 ఫీట్ రోడ్ వద్ద 3 అదనపు అంతస్తులకు ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. 60 ఫీట్ రోడ్ వద్ద 4 అదనపు అంతస్తులు నిర్మించుకోవచ్చు. అంతేకాకుండా…. 80 ఫీట్ రోడ్ వద్ద 5 అదనపు అంతస్తులకు అనుమతి ఇచ్చింది. 10 అంతస్తులకు పైగా భవనాల్లో టీడీఆర్ వినియోగాన్ని తప్పనిసరి చేసింది.

  • 2000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో…. 40 అడుగుల రోడ్డు వద్ద 3 అదనపు అంతస్తుల వరకు అనుమతించవచ్చు.
  • 60 అడుగుల రోడ్డు ఉన్న ప్లాట్లలో 4 అదనపు అంతస్తుల వరకు అనుమతి ఉంటుంది.
  • 80 అడుగుల వద్ద ఉన్న ప్లాట్లలో 5 అదనపు అంతస్తుల వరకు అనుమతి ఉంటుంది. TDR వినియోగం మరియు ఫైర్, ఎయిర్‌పోర్ట్ నిబంధనలకు లోబడి ఉండాలి
  • 10 నుండి 20 అంతస్తుల మధ్య ఉన్న హై-రైజ్ భవనాలకు, 10వ అంతస్తు పైన ఉన్న మొత్తం బిల్ట్-అప్ ఏరియాలో 3 శాతం వరకు TDR వినియోగించాలి.
  • 20 అంతస్తుల కంటే ఎక్కువ ఉన్న భవనాలకు…. 20వ అంతస్తు పైన ఉన్న ఏరియాలో 5 శాతం వరకు TDR వినియోగించాలి.
  • భవన నిర్మాణ అనుమతి (Building Permission) ఇచ్చే సమయంలో 50 శాతం TDR సమర్పించాలి.
  • మిగిలిన 50 శాతం TDR ను ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (OC) ఇచ్చే ముందు సమర్పించాలి.

వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం TDR(Transferable Development Rights) వినియోగాన్ని క్రమబద్ధీకరించినట్లు మున్సిపల్ శాఖ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. భవన నిర్మాణ నిబంధనలలో వెసులుబాటును పెంపొందించడానికి ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More