నవంబర్ చివరి నాటికి లేదా డిసెంబర్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు పూర్తి చేసేలా ప్రణాళికలు వేస్తోంది. నవంబర్ 3న వెనకబడిన తరగతులకు(బీసీ) 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు కేసును విచారించనుంది.

కోర్టు ఉపశమనం ఇస్తుందా లేదా అనే దానిపై ఆధారపడి ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించిందని సమాచారం. గతంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో 9 అమలును హైకోర్టు నిలిపివేసింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు తుది విచారణ కోసం హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో ప్రభుత్వం ఎదురుచూస్తొంది. అయితే హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరించినా.. డిసెంబర్‌లో ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 7న కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో హైకోర్టు నిర్ణయం ఆధారంగా ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేబినెట్ అధికారికంగా అభ్యర్థించనుంది.
కోర్టు స్టే ఎత్తివేస్తే 42 శాతం బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలు జరుగుతాయి. అయితే స్టే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42 శాతం ప్రాతినిధ్యం కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు పార్టీ తరఫున 42 శాతం బీసీ కోటాను అమలు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ ప్రారంభంలో ఎన్నికలకు సిద్ధం కావాలని ఈసీకి ప్రభుత్వం తెలపనుంది. కోర్టు ఉపశమనం ఇవ్వకపోతే ప్రస్తుతమున్న 23 శాతం బీసీ కోటా కింద ఎన్నికలు జరుగుతాయి. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం.
{{/usCountry}}నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ ప్రారంభంలో ఎన్నికలకు సిద్ధం కావాలని ఈసీకి ప్రభుత్వం తెలపనుంది. కోర్టు ఉపశమనం ఇవ్వకపోతే ప్రస్తుతమున్న 23 శాతం బీసీ కోటా కింద ఎన్నికలు జరుగుతాయి. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం.
{{/usCountry}}హైకోర్టు తీర్పు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ సంతానం ఉన్న అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు. ఈ మేరకు గతంలో ఉన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్టుగాప్రకటించింది.
మరోవైపు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయడంపై కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. నవంబర్, డిసెంబర్‌లలో రబీ సీజన్ ప్రారంభానికి ముందు రైతులకు ప్రయోజనం చేకూర్చేలా నిధులను విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ప్రభుత్వ పథకాల కింద రైతుల ఖాతాలకు ఆర్థిక బదిలీలు చేయలేరు. కాబట్టి ముందుగానే నిధులు బదిలీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఈ లెక్కన నవంబర్‌లో రైతు భరోసా నిధులు రావొచ్చు.