హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్ ఆధారిత వాహన సేవలను మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్వరలోనే నూతన మోటార్ వెహికల్ అగ్రిగేటర్ పాలసీని అమలులోకి తీసుకురానున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రవాణా వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడం ఈ విధానం ప్రధాన లక్ష్యమని చెప్పారు.

ఈ నూతన విధాన రూపకల్పన కోసం ప్రభుత్వం ఇదివరకే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ప్రతినిధులు క్యాబ్ డ్రైవర్ల సంఘాలు, అగ్రిగేటర్ సంస్థల యాజమాన్యాలు, ప్రయాణికుల హక్కుల నిపుణులతో సమగ్రంగా చర్చించారు. ప్రస్తుతం చివరి దశకు చేరుకున్న ఈ నివేదికను కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది. నివేదిక అందగానే నూతన నిబంధనలను నోటిఫై చేయనున్నారు.
ఈ కమిటీ పలు అంశాలను లోతుగా అధ్యయనం చేసి సిఫార్సులను సిద్ధం చేసింది. ముఖ్యంగా ప్రయాణికుల రక్షణ, వాహనాల ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్లతో పాటు ప్లాట్‌ఫామ్ డ్రైవర్ల సంక్షేమానికి పెద్దపీట వేసింది. ప్రస్తుతం డ్రైవర్లు ఎదుర్కొంటున్న అధిక కమిషన్ సమస్యలు, పని గంటలు, సర్జ్ ప్రైసింగ్ పద్ధతులను నియంత్రించేందుకు కచ్చితమైన మార్గదర్శకాలు రానున్నాయి.
పాలసీలోని ప్రధాన ప్రతిపాదనలు చూసుకుంటే.. ప్రయాణ ధరల్లో అక్రమ వ్యత్యాసాలు లేకుండా పారదర్శకమైన ఛార్జీల నియంత్రణ వ్యవస్థ ఉంటుంది. మహిళా ప్రయాణికులు, మహిళా డ్రైవర్ల భద్రత కోసం ప్రత్యేక డిజిటల్ పర్యవేక్షణ, ఎమర్జెన్సీ బటన్ సదుపాయం అందిస్తారు. ప్రయాణికులు, డ్రైవర్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సమర్థవంతమైన గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ తీసుకువస్తారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం కూడా ఈ పాలసీలో భాగం. అగ్రిగేటర్ సంస్థలు, రవాణా శాఖ మధ్య సమాచార మార్పిడి ద్వారా భద్రతను పర్యవేక్షించడం చేస్తారు. ఈ విధానం అమలులోకి వస్తే ప్రయాణికులకు సురక్షితమైన రవాణా అందడమే కాకుండా, వేలాది మంది గిగ్ వర్కర్లు, డ్రైవర్ల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది.
{{/usCountry}}పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం కూడా ఈ పాలసీలో భాగం. అగ్రిగేటర్ సంస్థలు, రవాణా శాఖ మధ్య సమాచార మార్పిడి ద్వారా భద్రతను పర్యవేక్షించడం చేస్తారు. ఈ విధానం అమలులోకి వస్తే ప్రయాణికులకు సురక్షితమైన రవాణా అందడమే కాకుండా, వేలాది మంది గిగ్ వర్కర్లు, డ్రైవర్ల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది.
{{/usCountry}}