Ground Water : డేంజర్ బెల్స్.. పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలు!
Ground Water : తెలంగాణలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఓవైపు ఎల్‌నినో ప్రభావం కనిపిస్తూనే ఉంది. దీంతో నీటి కష్టాలు తప్పేలా లేవు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ మహానగరంతో పాటు దానికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో నీటి సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. వార్షిక భూగర్భ జల వనరుల్లో దాదాపు 70 శాతానికి పైగా ఇప్పటికే తోడేయడంతో ఈ ప్రాంతాలు తీవ్రమైన గ్రౌండ్ వాటర్ స్ట్రెస్ (భూగర్భ జల ఒత్తిడి)ని ఎదుర్కొంటున్నాయి.

2025-26 సంవత్సరానికి సంబంధించిన ఇండియా-గ్రౌండ్ వాటర్ రిసోర్స్ ఎస్టిమేషన్ సిస్టమ్(IN-GRES) అంచనాల ప్రకారం.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలతో కూడిన కోర్ అర్బన్ రీజియన్‌లో లభ్యమయ్యే 72,000 హెక్టార్-మీటర్ల వార్షిక భూగర్భ జలాల్లో.. ఇప్పటికే దాదాపు 48,000 హెక్టార్-మీటర్ల నీటిని తోడేసినట్లు తేలింది.
ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే భూగర్భ జలాల తోడకం పునరుద్ధరణ అయ్యే లభ్యత కంటే దాటిపోయింది. జిల్లాలోని మొత్తం 16 గ్రౌండ్ వాటర్ అసెస్మెంట్ యూనిట్లలో 15 యూనిట్లు క్రిటికల్ లేదా ఓవర్-ఎక్స్ప్లోయిటెడ్(అతిగా తోడేసిన) కేటగిరీ కిందకు చేరాయి.
హైదరాబాద్ జిల్లా పరిధిలోని 8 ప్రాంతాలు ఓవర్-ఎక్స్ప్లోయిటెడ్ కేటగిరీలో ఉన్నాయి. అందులోనివి అంబర్పేట్, అమీర్‌పేట్, ఆసిఫ్‌నగర్, చార్మినార్, గోల్కొండ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, సైదాబాద్.
మరో 7 ప్రాంతాలు క్రిటికల్ కేటగిరీలో ఉన్నాయి. అవి బహదూర్‌పురా, బండ్లగూడ, మారేడ్‌పల్లి, ముషీరాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్, షేక్‌పేట్.
లభ్యమయ్యే నీటిలో 90 నుండి 100 శాతం వరకు వాడితే ఆ ప్రాంతాన్ని 'క్రిటికల్'గా, వాడకం 100 శాతం దాటిపోతే దానిని 'ఓవర్-ఎక్స్ప్లోయిటెడ్'గా నిర్ధారిస్తారు. కాగా గత ఏడాది (2024-25) హైదరాబాద్‌లో 11 యూనిట్లు క్రిటికల్ లేదా ఓవర్-ఎక్స్ప్లోయిటెడ్ పరిధిలో ఉండగా, ఈ ఏడాది ఆ సంఖ్య 15కు పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నివాస, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలంగాణ భూగర్భ జలాల శాఖ స్పష్టం చేసింది.
హైదరాబాద్ వాటర్ బోర్డు అందిస్తున్న నీరు నగర మొత్తం అవసరాలలో కేవలం 30 శాతం మాత్రమే తీర్చగలుగుతోంది. దీంతో మిగిలిన 70 శాతం అవసరాల కోసం గృహాలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు పూర్తిగా బోర్ బావులపైనే ఆధారపడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర జనాభాలో దాదాపు మూడో వంతు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోనే నివసిస్తున్నప్పటికీ, రాష్ట్ర వార్షిక భూగర్భ జల వనరులలో ఈ ప్రాంతానికి దక్కుతున్నది కేవలం 3 శాతం మాత్రమే. తెలంగాణలో లభ్యమయ్యే భూగర్భ జలాలు దాదాపు 21 లక్షల హెక్టార్-మీటర్లు కాగా.. క్యూర్ పరిధిలో ఉన్నది కేవలం 72,000 హెక్టార్-మీటర్లు మాత్రమే.
హైదరాబాద్ ఎదుర్కొంటున్న సమస్య కేవలం నీటిని విపరీతంగా తోడేయడమే కాదు, భూమిలోకి ఇంకే నీటి శాతం పడిపోవడం కూడా ప్రధాన కారణం. నగరంలో వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, విశాలమైన ఖాళీ స్థలాలు మాయమై కాంక్రీట్ రోడ్లు, భవనాలుగా మారడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పునరుద్ధరణ అయ్యే అవకాశం లేకుండా పోయింది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నగరంలోని ప్రతి నివాసం, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేయాలి. నగర పరిధిలోని సహజ నీటి వనరులు, చెరువులను కబ్జాల బారిన పడకుండా కాపాడుకుని, వాటిని పూడిక తీత ద్వారా రీఛార్జ్ పాయింట్లుగా మార్చాలి. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (STP) ద్వారా శుద్ధి చేసిన నీటిని కన్స్ట్రక్షన్, తోటపని వంటి అవసరాలకు వాడాలి. ప్రతి పౌరుడు నీటి వృథాను అరికట్టి, భూగర్భ జలాల సంరక్షణలో భాగస్వామి కావాలి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


