EFLU Recruitment 2026 : హైదరాబాద్ ఇఫ్లూలో ట్యూటర్ ఉద్యోగాలు - నెలకు రూ.50 వేల వరకు జీతం
EFLU Tutor Recruitment 2026 : హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో తాత్కాలిక ప్రాతిపదికన ట్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవుతుంది. జర్మన్, జపనీస్ భాషలకు దరఖాస్తులు కోరుతున్నారు.
EFLU Tutor Recruitment 2026 : హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఈఎఫ్‌ఎల్‌యూ - ఇఫ్లూ) ఉద్యోగార్థులకు మంచి అవకాశం కల్పించింది. ఇఫ్లూలోని 'సెంటర్ ఫర్ కన్సల్టెన్సీ అండ్ లాంగ్వేజ్ ట్రైనింగ్' (సీసీఎల్‌టీ) విభాగం ఆధ్వర్యంలో విదేశీ భాషలకు సంబంధించిన ట్యూటర్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను జారీ చేసింది.మెడికల్, హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌కు విదేశీ భాషల శిక్షణ, స్కిల్ ఆధారిత కోర్సులు బోధించేందుకు ఈ నియామకాలను చేపడుతున్నారు.

మొత్తం 14 ఖాళీలు…
ప్రస్తుతం జర్మన్ , జపనీస్ భాషా విభాగాల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రతి భాషలోనూ 7 పోస్టులు చొప్పున మొత్తం 14 ఖాళీలు ఉన్నాయి.
జర్మన్ ట్యూటర్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి జర్మన్ భాషలో ఎంఏ పూర్తి చేసి ఉండాలి. లేదా 75 శాతం మార్కులతో 4 ఏళ్ల బిఏ హానర్స్ లేదా 3 ఏళ్ల బిఏ హానర్స్ చేసి ఉండాలి.జర్మన్ భాష బోధించిన అనుభవం ఉండాలి. గోథే ఇన్‌స్టిట్యూట్ లేదా టీఈఎల్ సీ (TELC) నుంచి బి2 (B2) లేదా అంతకంటే ఎక్కువ స్థాయి సర్టిఫికేషన్ ఉన్నవారికి, మెడికల్ ప్రొఫెషనల్స్‌కు జర్మన్ బోధించిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
జపనీస్ ట్యూటర్ : ఏదైనా సబ్జెక్ట్‌లో కనీసం 75 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు జపనీస్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (JLPT)లో N3 లేదా అంతకంటే ఎక్కువ స్థాయి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కేర్‌గివింగ్, హెల్త్‌కేర్ కమ్యూనికేషన్, హెల్త్‌కేర్ రంగానికి చెందిన జపనీస్ పదజాలం మరియు బోధనలో అనుభవం లేదా ప్రావీణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. అభ్యర్థులకు ఇంగ్లీష్ భాషలోనూ మంచి ప్రావీణ్యం ఉండాలి.
ఈ నియామకాలు రెండేళ్ల కాలపరిమితి (అక్టోబర్ 2026 నుంచి సెప్టెంబర్ 2028 వరకు) ఒప్పంద ప్రాతిపదికన ఉంటాయి. ఎంపికైన అభ్యర్థుల ప్రతిభ, పనితీరు ఆధారంగా నెలకు రూ. 30,000 నుంచి రూ. 50,000 వరకు వేతనం నిర్ణయిస్తారు. దరఖాస్తు విధానంఈ పోస్టులకు ఆన్‌లైన్ ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్…
ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ సీవీ (CV), వాలిడ్ ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో పాటు సంబంధిత పత్రాలను directorcclt@efluniversity.ac.in కి ఇమెయిల్ పంపాలి. ఇమెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో తప్పనిసరిగా "Application for the Tutor - [Language Name]" (ఉదాహరణకు: Application for the Tutor-Japanese) అని పేర్కొనాలి.
హాజరైన దరఖాస్తులను పరిశీలించి షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే ఆన్‌లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీ, సమయం, ఇతర వివరాలను అభ్యర్థుల వ్యక్తిగత ఇమెయిల్ ఐడీకి పంపుతారు. పూర్తి చేయని దరఖాస్తులు, గడువు ముగిసిన తర్వాత వచ్చే అప్లికేషన్లను తిరస్కరిస్తారు.
- దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ - అక్టోబర్ 19, 2026.
- అధికారిక వెబ్ సైట్ - https://www.efluniversity.ac.in/
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

