వివిధ కోర్సుల కోసం జర్మన్ విశ్వవిద్యాలయంతో ఓయూ, కేయూ ఒప్పందం

ఓయూ, కేయూ జర్మనీలోని రాయ్‌ట్లింగెన్ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. బ్యాచిలర్, మాస్టర్స్ ప్రోగ్రామ్‌లు, విద్యార్థుల ఇమ్మర్షన్, ఉద్యోగాలు లభించనున్నాయి.

Published on: Sep 1, 2026, 09:18:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని ప్రముఖ ఉన్నత విద్యాసంస్థలైన ఉస్మానియా యూనివర్సిటీ (OU), కాకతీయ యూనివర్సిటీ (KU) గ్లోబల్ విద్యా రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. జర్మనీకి చెందిన ప్రముఖ ప్రభుత్వ విద్యాసంస్థ రాయ్‌ట్లింగెన్ యూనివర్సిటీతో విద్యా రంగానికి సంబంధించి కీలకమైన అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా బ్యాచిలర్, మాస్టర్స్ కోర్సులు అభ్యసించే విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్య, విదేశీ పరిశ్రమలలో అనుభవం, ఉద్యోగ అవకాశాలు సులభంగా లభించనున్నాయి.

ఉస్మానియా యూనివర్సిటీ
ఉస్మానియా యూనివర్సిటీ

ఐదేళ్ల కాలపరిమితితో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల విద్యాసంస్థల మధ్య నాలెడ్జ్ షేరింగ్, పరిశోధనలు వేగవంతం కానున్నాయి. ప్రారంభంలో కంప్యూటర్ సైన్స్, ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ విభాగాలలో ఈ కార్యక్రమాలను అమలు చేస్తారు.

రాబోయే రోజుల్లో డిజిటల్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఇతర ప్రాథమిక ఇంజినీరింగ్ విభాగాలకు మాస్టర్స్ ప్రోగ్రామ్‌లను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం విద్యార్థుల ఇమ్మర్షన్ ప్రోగ్రామ్. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం ప్రతిభావంతులైన 30 మంది విద్యార్థులను స్క్రీనింగ్ ద్వారా ఎంపిక చేసి నామినేట్ చేస్తుంది.

ఎంపికైన విద్యార్థులు జర్మనీలో మూడేళ్ల పాటు ఉంటూ అకాడమిక్ ఇమ్మర్షన్, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ప్రత్యక్ష పారిశ్రామిక అనుభవాన్ని పొందుతారు. రాయ్‌ట్లింగెన్ విశ్వవిద్యాలయం తన పరిశ్రమల, విద్యా భాగస్వాములతో కలిసి జర్మనీలో అకాడమిక్ బోధన, మెంటార్‌షిప్, అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది.

జర్మనీ విద్యా వ్యవస్థకు, అక్కడి పారిశ్రామిక రంగానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు నేరుగా జర్మన్ టెక్నాలజీ, వర్క్ కల్చర్‌ని అధ్యయనం చేసేందుకు ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. కోర్సు పూర్తి కాగానే యూరోపియన్ యూనియన్ మార్కెట్‌లో మెరుగైన ఉపాధి అవకాశాలు సాధించడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చ్యునిటీగా నిలవనుంది.

ఈ ప్రతిష్టాత్మక ఒప్పంద కార్యక్రమ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి తదితరులు పాల్గొని పత్రాలను మార్పిడి చేసుకున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More