ఐవీఎఫ్ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన తెలుగు రాష్ట్రాల పరిశోధనలు!

ప్రపంచ ఐవీఎఫ్‌ దినోత్సవం సందర్భంగా ఫెర్టీ9కు అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రఖ్యాత సదస్సులకు ఈ సంస్థ పరిశోధనా పత్రాలు ఎంపికయ్యాయి.

Published on: Jul 26, 2026, 16:46:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐవీఎఫ్ సెంటర్ ఫెర్టీ9 అంతర్జాతీయ స్థాయిలో ఘనత సాధించింది. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫెర్టీ9 యాజమాన్యం తమ సంస్థ సాధించిన పరిశోధనా ఫలితాలను, సాంకేతిక పురోగతిని పంచుకుంది. ఈ కార్యక్రమంలో సీఈఓ సుకేష్ గైన్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి సి. బుడితో పాటు సీనియర్ ఫెర్టిలిటీ నిపుణులు డాక్టర్ ఉషా బృందిని, డాక్టర్ సాహితి పాల్గొన్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

గ్లోబల్ మెడికల్ కాన్ఫరెన్స్‌లలో ఫెర్టీ9 సమర్పించిన పరిశోధనా పత్రాలకు గ్లోబల్ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ESHRE 2026 సదస్సులో నాలుగు పరిశోధనా పత్రాలు, ఒక ఓరల్ ప్రెజెంటేషన్ ఎంపికవ్వగా.. టోక్యో (జపాన్) అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు నాలుగు, అలాగే ప్రతిష్ఠాత్మక యాస్పైర్(ASPIRE) సమావేశానికి 11 రీసెర్చ్ పేపర్లు ఎంపికయ్యాయి. గత ఐదేళ్ల క్లినికల్ ఆధారాలను విశ్లేషిస్తూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో సంతానోత్పత్తి ధోరణులు, ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గడం, పీసీఓఎస్, మారుతున్న జీవనశైలి ప్రభావంపై ఈ అధ్యయనాలు నిర్వహించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ మొత్తం జననాల రేటు ఆందోళనకరంగా తగ్గుతోందని డాక్టర్ జ్యోతి సి. బుడి ఆవేదన వ్యక్తం చేశారు. సంతానలేమి సమస్యలపై అవగాహన పెంచుకోవడం, సమస్య మూలాలను త్వరగా గుర్తించడమే సగం విజయమని డాక్టర్ ఉషా బృందిని తెలిపారు.

ఐవీఎఫ్ ప్రక్రియలో రోగులకు ఇంజెక్షన్ల భయం, నొప్పుల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఫెర్టీ9 ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ 11 కేంద్రాల్లో 'నీడిల్-ఫ్రీ ఐవీఎఫ్' సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రత్యేకమైన నీడిల్-ఫ్రీ డ్రగ్ డెలివరీ టెక్నాలజీ ద్వారా అండాల ఉత్పత్తి సమయంలో రోజూ ఇచ్చే సూదుల అవసరం లేకుండానే వైద్యం అందిస్తారు.

ఈ కార్యక్రమంలో సీఈఓ సుకేష్ గైన్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి సి. బుడితో పాటు సీనియర్ ఫెర్టిలిటీ నిపుణులు డాక్టర్ ఉషా బృందిని, డాక్టర్ సాహితి పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More