జీఎస్టీ మోసానికి పాల్పడిన గేమింగ్ సంస్థ యాడ్సన్ అడ్వైజరీ సర్వీస్ డైరెక్టర్ పంకజ్ కుమార్‌ను జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో అక్రమ ఆన్‌లైన్ గేమింగ్‌పై భారీ స్థాయిలో చేపట్టిన దాడుల్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ జోనల్ యూనిట్ రూ. 13,000 కోట్ల విలువైన సిండికేట్ గుట్టురట్టు చేసింది.

డిజిటల్ కేవైసీ వెరిఫికేషన్ సేవలలో ప్రత్యేకత కలిగిన యాడ్సన్ అడ్వైజరీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ పంకజ్ కుమార్‌ను అధికారులు అరెస్టు చేశారు. దర్యాప్తు సమయంలో సేకరించిన ఆధారాలు చెల్లింపు అగ్రిగేటర్లు, థర్డ్ పార్టీ టెక్నాలజీ ప్రొవైడర్లు సహా అనుబంధ ఫిన్‌టెక్ కంపెనీల సహాయంతో అక్రమ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌లను నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. షెల్ కంపెనీలకు నకిలీ కేవైసీ వెరిఫికేషన్లు ఇచ్చినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనలో గేమింగ్ యాప్స్ నిర్వహిస్తూ.. ప్రజలను మోసం చేయడమే కాకుండా.. ఆ నగదును షెల్ కంపెనీల ద్వారా తరలించినట్టుగా అధికారులు గుర్తించారు. పేమెంట్ గేట్ వే ఆధారంగా ఈ వ్యవహారాన్ని చేస్తున్నారు. షెల్ కంపెనీల పేరుతో నకిలీ కేవైసీ పత్రాలను సృష్టించి, వాటిని గేమింగ్ వెబ్‌సైట్లతో అనుసంధానం చేశారు. ఆన్‌లైన్ గేమింగ్ నుంచి వచ్చే భారీ నగదు ప్రవాహాన్ని నిర్వహించడానికి పేమెంట్ గేట్‌వేలను అక్రమంగా వాడుకున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్లలో బెట్టింగ్ కట్టిన వారి నగదును దారి మళ్లించడానికి వందలాది షెల్ కంపెనీల యూపీఐ ఐడీలను వాడినట్లు గుర్తించారు. ఈ లావాదేవీలను టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ల డేటా ద్వారా అధికారులు తెలుసుకున్నారు.
వ్యాపారులు, షెల్ సంస్థల మోసపూరిత కేవేసీ ధృవీకరణకు బాధ్యత వహించిన సూత్రధారులలో పంకజ్ కుమార్ ఒకరిగా ఉన్నారు. పేమెంట్ గేట్వేలు, బ్యాంకింగ్ యూజ్ పేమెంట్ అగ్రిగేటర్లతో ఈ యాడ్సన్ సంస్థకు లింకులు ఉన్నాయి. ఆన్‌లైన్ గేమింగ్ కార్యకలాపాల నుండి వచ్చే నగదు ప్రవాహానికి అవసరమైన యూపీఐ ఇంటిగ్రేషన్ కోసం షెల్ కంపెనీలను చేర్చుకోవడంలో పంకజ్ సహాయపడినట్టుగా అధికారులు గుర్తించారు. ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్ ద్వారా లభించిన అక్రమ ఆదాయాన్ని పొందిన లబ్ధిదారుల్లో ఇతడు కూడా ఒకరు.
{{/usCountry}}వ్యాపారులు, షెల్ సంస్థల మోసపూరిత కేవేసీ ధృవీకరణకు బాధ్యత వహించిన సూత్రధారులలో పంకజ్ కుమార్ ఒకరిగా ఉన్నారు. పేమెంట్ గేట్వేలు, బ్యాంకింగ్ యూజ్ పేమెంట్ అగ్రిగేటర్లతో ఈ యాడ్సన్ సంస్థకు లింకులు ఉన్నాయి. ఆన్‌లైన్ గేమింగ్ కార్యకలాపాల నుండి వచ్చే నగదు ప్రవాహానికి అవసరమైన యూపీఐ ఇంటిగ్రేషన్ కోసం షెల్ కంపెనీలను చేర్చుకోవడంలో పంకజ్ సహాయపడినట్టుగా అధికారులు గుర్తించారు. ఆన్‌లైన్ గేమింగ్ సిండికేట్ ద్వారా లభించిన అక్రమ ఆదాయాన్ని పొందిన లబ్ధిదారుల్లో ఇతడు కూడా ఒకరు.
{{/usCountry}}ఈ సిండికేట్లపై డీజీజీఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ దాడులు చేస్తోంది. ఇందులో భాగంగా యాడ్సన్ సంస్థకు చెందిన రూ. 100 కోట్ల వరకు నగదు ఉన్న బ్యాంకు ఖాతాలను అధికారులు ఫ్రీజ్ చేశారు. కీలక వ్యక్తులను అరెస్టు చేశారు. ఆన్‌లైన్ గేమింగ్ రంగంపై జరుగుతున్న పెద్ద ఆపరేషన్‌లో ఈ అరెస్టు భాగంగా చెప్పుకొవచ్చు. ఈ మోసపూరిత సిండికేట్ 2025లో సుమారు 23 బిలియన్ డాలర్ల స్థూల విలువను సాధించింది.
తనిఖీల్లో భాగంగా అధికారులు ఇప్పటికే వివిధ బ్యాంకు ఖాతాలలో నిధులను సేకరించారు. ఈ భారీ రాకెట్‌తో సంబంధం ఉన్న ఇతర అనుబంధ ఫిన్‌టెక్ కంపెనీలు, సూత్రధారుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ ఆర్థిక మోసంలో ఉన్న భాగస్వాములను బయటకు లాగేందుకు డిజిటల్ మనీ ట్రయల్‌పై మరింత దర్యాప్తు జరుగుతోంది.