వాషింగ్టన్/హైదరాబాద్: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు వీసా నిబంధనల రూపంలో మరోసారి ఆందోళన మొదలైంది. హెచ్-1బీ సహా వివిధ రకాల ఎంప్లాయ్మెంట్ ఆధారిత వీసాల పొడిగింపు (ఎక్స్టెన్షన్) దరఖాస్తులను పరిశీలించేటప్పుడు, గతంలో ఇచ్చిన అనుమతులను యథాతథంగా ఆమోదించే విధానానికి స్వస్తి పలకాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ (డీహెచ్ఎస్) ఫెడరల్ రిజిస్టర్లో ప్రతిపాదనలను ప్రచురించింది.
అధికారులకు విచక్షణాధికారాలు
ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం.. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సిఐఎస్) అధికారులకు వీసా దరఖాస్తులను పునఃసమీక్షించేందుకు పూర్తి స్థాయి విచక్షణాధికారాలు లభిస్తాయి. గతంలో ఒక ఉద్యోగికి వీసా ఆమోదం పొందినప్పటికీ, పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ అతని అర్హతలను అధికారులు మళ్లీ మొదటి నుంచి ఆమోదయోగ్యమా కాదా అని తనిఖీ చేస్తారు.
ఈ ప్రతిపాదనపై నవంబర్ 13, 2026 వరకు ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ కామెంట్స్) స్వీకరించనున్నారు. తుది నిబంధనలు ఖరారయ్యే వరకు ప్రస్తుతం ఉన్న పాత నిబంధనలే అమలులో ఉంటాయి.
గత అనుమతుల ప్రాధాన్యం ఏమిటి?
సాధారణంగా హెచ్-1బీ వీసాపై వెళ్లే ఉద్యోగులకు మొదట మూడేళ్ల కాలపరిమితితో అనుమతి ఇస్తారు. ఆ తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. గ్రీన్ కార్డ్ ప్రక్రియలో ఉన్నవారికి ఆరేళ్ల పరిమితి దాటిన తర్వాత కూడా ఎక్స్టెన్షన్లు లభిస్తాయి.
ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. ఒకే సంస్థలో పనిచేస్తూ, ఉద్యోగ స్వభావం లేదా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేనప్పుడు యుఎస్సిఐఎస్ అధికారులు గతంలో ఇచ్చిన ఆమోదానికే ప్రాధాన్యతనిచ్చి సులభంగా వీసా పొడిగించేవారు. ఏదైనా స్పష్టమైన తప్పు జరిగిందని తేలితే లేదా ఉద్యోగికి సంబంధించి తీవ్రమైన మార్పులు ఉంటే తప్ప పాత అనుమతిని తోసిపుచ్చేవారు కాదు. కానీ, నూతన విధానం అమలులోకి వస్తే అధికారులు ప్రతి నియామకాన్ని కొత్త కోణంలో విశ్లేషిస్తారు.
పెరగనున్న తిరస్కరణలు, వేచి చూసే సమయం
ప్రముఖ ఇమ్మిగ్రేషన్ సంస్థ 'ఫ్రాగోమెన్' నివేదిక ప్రకారం.. ఈ కొత్త మార్పు వల్ల యుఎస్సిఐఎస్ నుంచి అదనపు ఆధారాధారాలు చూపాలని కోరే ఆర్ఎఫ్ఈ (Request for Evidence) నోటీసులు పెరిగే అవకాశముంది. దీనివల్ల ప్రాసెసింగ్ సమయం ఆలస్యం కావడమే కాకుండా, వీసా తిరస్కరణల (రిజెక్షన్ల) శాతం కూడా భారీగా పెరిగే ప్రమాదముంది.
{{/usCountry}}ప్రముఖ ఇమ్మిగ్రేషన్ సంస్థ 'ఫ్రాగోమెన్' నివేదిక ప్రకారం.. ఈ కొత్త మార్పు వల్ల యుఎస్సిఐఎస్ నుంచి అదనపు ఆధారాధారాలు చూపాలని కోరే ఆర్ఎఫ్ఈ (Request for Evidence) నోటీసులు పెరిగే అవకాశముంది. దీనివల్ల ప్రాసెసింగ్ సమయం ఆలస్యం కావడమే కాకుండా, వీసా తిరస్కరణల (రిజెక్షన్ల) శాతం కూడా భారీగా పెరిగే ప్రమాదముంది.
{{/usCountry}}గతంలో డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2017లో ఈ 'డెఫరెన్స్ పాలసీ'ని రద్దు చేశారు. ఆ సమయంలో హెచ్-1బీ వీసాల పొడిగింపు తిరస్కరణ రేటు ఏకంగా 24 శాతానికి పెరిగింది. కానీ, ఆ తర్వాత బైడెన్ యంత్రాంగం 2021లో ఈ విధానాన్ని పునరుద్ధరించి, 2024లో అధికారిక నిబంధనగా మార్చింది. దీనివల్ల ప్రస్తుతం వీసా రిజెక్షన్ రేటు కేవలం 3.5 శాతంగా మాత్రమే ఉంది. అయితే, మళ్లీ పాత రోజులు పునరావృతమైతే భారతీయ టెక్కీల భవిష్యత్తుపై అనిశ్చితి నీడలు కమ్ముకునే అవకాశం ఉంది.
ఎవరిపై ప్రభావం?
హెచ్-1బీ (H-1B) వీసాదారులతో పాటు ఎల్-1 (L-1 - కంపెనీ అంతర్గత బదిలీలు), ఓ-1 (O-1 - విశేష నైపుణ్యం కలిగినవారు) విభాగాల్లో 'ఫారమ్ I-129' ద్వారా దరఖాస్తు చేసుకునే హెచ్-1బీ ఉద్యోగులందరిపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. అమెరికాలో స్థిరపడాలని భావిస్తున్న వేలాది మంది తెలుగు వారితో పాటు భారతీయ ఐటీ నిపుణులకు ఈ పరిణామం తీరని ఆందోళన కలిగిస్తోంది.