తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఉపశమనం కలిగించేలా కొత్త నిర్ణయం ప్రకటించింది. లబ్ధిదారులు ఎదుర్కొంటున్న టెక్నికల్ సమస్యలను తగ్గించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. సడలించిన కొత్త నిబంధనతో ఇల్లు పూర్తి కాకున్నా.. తుది విడత బిల్లులు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఇల్లు నివాసయోగ్యంగా ఉంటే సరిపోతుంది.

దీనికి సంబంధించిన ఉత్తర్వులను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ.గౌతమ్ జారీ చేశారు. నిజానికి ప్రస్తుతం రూల్స్ ప్రకారం పేదలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంటి ఫ్లోరింగ్, లోపలి ప్లాస్టరింగ్, పూర్తిస్థాయి ఎలక్ట్రికల్ వైరింగ్ వంటి ఫినిషింగ్ పనులు పూర్తి అయిన తర్వాత కంప్లీషన్ స్టేజ్ ఫొటోలను లబ్ధిదారులు అప్‌లోడ్ చేస్తారు. అనంతరం ప్రభుత్వం నుంచి బిల్లు వస్తుంది.
కానీ ఈ నిబంధనను ప్రస్తుతం ప్రభుత్వ సడలించింది. ఎందుకంటే.. పేదలు ఈ చిన్న పనులను డబ్బు లేకపోవడంతో సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. ఫలితంగా.. తుది విడత బిల్లులు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. దీంతో నిరుపేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే పేదలు త్వరగా గృహ ప్రవేశం చేసుకునేలా ప్రభుత్వం నిబంధనలు సడలించింది. లోపలివైపున ప్లాస్టరింగ్ లేకపోయినా తుది విడుత బిల్లు మంజూరు చేస్తారు.
కొత్తగా సడలించిన నిబంధనల ప్రకారం.. బయటివైపున వైట్ వాష్ లేదంటే పెయింటింగ్ ఉంటే సరిపోతుంది. రెండో కోటింగ్ పెయింటింగ్ వేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. లోపలి గదులకు తలుపులు లేకపోయినా.. ఏం కాదు. కేవలం ఇంటి మెయిన్ డోర్ ఉంటే సరిపోతుంది.
ఇప్పటివరకు మెుత్తం వైరింగ్, ప్లంబింగ్ చేసి ఉండాలి. కానీ సడలింపు ప్రకారం.. పూర్తిస్థాయి వైరింగ్ లేకపోయినా పర్లేదు. తాత్కాలికంగా విద్యుత్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. టాయిలెట్, ఫ్యాన్ బిగించడం వంటి ప్లంబింగ్ పనులు తప్పనిసరికాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
{{/usCountry}}ఇప్పటివరకు మెుత్తం వైరింగ్, ప్లంబింగ్ చేసి ఉండాలి. కానీ సడలింపు ప్రకారం.. పూర్తిస్థాయి వైరింగ్ లేకపోయినా పర్లేదు. తాత్కాలికంగా విద్యుత్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. టాయిలెట్, ఫ్యాన్ బిగించడం వంటి ప్లంబింగ్ పనులు తప్పనిసరికాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
{{/usCountry}}కొత్త రూల్స్ ప్రకారం.. మార్పులకు అనుగుణంగా మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇంటి నిర్మాణ పటిష్టతను చూడాలని వెల్లడించింది. అంతేగానీ.. చిన్న చిన్న పనుల కోస బిల్లులు ఆపావద్దని తెలిపింది. ఈ సడలింపులతో రాష్ట్రంలోని అనేక ఇళ్లకు తుది దశ బిల్లులు రానున్నాయి.