Indiramma Illu : మీకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైందా? తుది బిల్లుల చెల్లింపుపై కీలక అప్డేట్
Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందిరమ్మ ఇళ్లు పూర్తి కాకున్నా.. తుది విడత బిల్లులను విడుదల చేయనుంది.
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఉపశమనం కలిగించేలా కొత్త నిర్ణయం ప్రకటించింది. లబ్ధిదారులు ఎదుర్కొంటున్న టెక్నికల్ సమస్యలను తగ్గించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. సడలించిన కొత్త నిబంధనతో ఇల్లు పూర్తి కాకున్నా.. తుది విడత బిల్లులు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఇల్లు నివాసయోగ్యంగా ఉంటే సరిపోతుంది.

దీనికి సంబంధించిన ఉత్తర్వులను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ.గౌతమ్ జారీ చేశారు. నిజానికి ప్రస్తుతం రూల్స్ ప్రకారం పేదలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంటి ఫ్లోరింగ్, లోపలి ప్లాస్టరింగ్, పూర్తిస్థాయి ఎలక్ట్రికల్ వైరింగ్ వంటి ఫినిషింగ్ పనులు పూర్తి అయిన తర్వాత కంప్లీషన్ స్టేజ్ ఫొటోలను లబ్ధిదారులు అప్‌లోడ్ చేస్తారు. అనంతరం ప్రభుత్వం నుంచి బిల్లు వస్తుంది.
కానీ ఈ నిబంధనను ప్రస్తుతం ప్రభుత్వ సడలించింది. ఎందుకంటే.. పేదలు ఈ చిన్న పనులను డబ్బు లేకపోవడంతో సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. ఫలితంగా.. తుది విడత బిల్లులు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. దీంతో నిరుపేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే పేదలు త్వరగా గృహ ప్రవేశం చేసుకునేలా ప్రభుత్వం నిబంధనలు సడలించింది. లోపలివైపున ప్లాస్టరింగ్ లేకపోయినా తుది విడుత బిల్లు మంజూరు చేస్తారు.
కొత్తగా సడలించిన నిబంధనల ప్రకారం.. బయటివైపున వైట్ వాష్ లేదంటే పెయింటింగ్ ఉంటే సరిపోతుంది. రెండో కోటింగ్ పెయింటింగ్ వేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. లోపలి గదులకు తలుపులు లేకపోయినా.. ఏం కాదు. కేవలం ఇంటి మెయిన్ డోర్ ఉంటే సరిపోతుంది.
ఇప్పటివరకు మెుత్తం వైరింగ్, ప్లంబింగ్ చేసి ఉండాలి. కానీ సడలింపు ప్రకారం.. పూర్తిస్థాయి వైరింగ్ లేకపోయినా పర్లేదు. తాత్కాలికంగా విద్యుత్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. టాయిలెట్, ఫ్యాన్ బిగించడం వంటి ప్లంబింగ్ పనులు తప్పనిసరికాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కొత్త రూల్స్ ప్రకారం.. మార్పులకు అనుగుణంగా మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇంటి నిర్మాణ పటిష్టతను చూడాలని వెల్లడించింది. అంతేగానీ.. చిన్న చిన్న పనుల కోస బిల్లులు ఆపావద్దని తెలిపింది. ఈ సడలింపులతో రాష్ట్రంలోని అనేక ఇళ్లకు తుది దశ బిల్లులు రానున్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


