...
...
Next Story

Hyderabad Rain : హైదరాబాద్‌లో భారీ వర్షం.. అధికారుల కీలక సూచనలు

Hyderabad Rain : హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతోంది. దీంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఎదురైంది. మరోవైపు అధికారులు కీలక సూచనలు చేశారు.

Published on: Jul 28, 2026, 21:13:41 IST
Advertisement

హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై విపరీతంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వరద నీటితో ఉన్న రోడ్లపై జాగ్రత్తగా వెళ్లాలి అని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరం అయితే తప్పా.. బయటకు రావొద్దని చెప్పారు.

హైదరాబాద్‌లో వర్షం
హైదరాబాద్‌లో వర్షం

హైదరాబాద్‌ నగరంలోని మియాపూర్, కూకట్‌పల్లి, రాయదుర్గం, మణికొండ, హైటెక్‌సిటీ, మాదాపూర్‌, యూసుఫ్‌గూడ, ఖైరతాబాద్‌, కోఠి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, నాచారం, కాప్రా, ఉప్పల్, నారపల్లితోపాటుగా ఇతర ప్రాంతాల్లోనూ వానలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ఉంది.

ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం సాయంత్రం 5 గంటల సమయంలో ఒక్కసారిగా మారి ఆకాశం మేఘావృతమైంది. ఆ తర్వాత నగరవ్యాప్తంగా, ముఖ్యంగా రద్దీ వేళల్లో వర్షం కురిసింది. వాతావరణంలో వచ్చిన ఈ అకస్మాత్తు మార్పు పగటిపూట ఉన్న వేడి నుండి ఉపశమనాన్ని కలిగించినప్పటికీ నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచేలా చేసింది.

తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) గణాంకాల ప్రకారం, సాయంత్రం 6 గంటల సమయానికి కీసరలో 19.3 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో మేడ్చల్ (18 మి.మీ), కొంపల్లి (16 మి.మీ), జూబ్లీహిల్స్ (15.8 మి.మీ), బోరబండ (14.3 మి.మీ), కూకట్‌పల్లి (11.8 మి.మీ) మరియు అమీన్‌పూర్ (9.8 మి.మీ) ఉన్నాయి.

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నందున నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ కోరారు. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయి, ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోందన్నారు. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe