Telangana Rains : తెలంగాణకు బిగ్ అలర్ట్ - ఈనెల 18 నుంచి భారీ వర్షాలు : వాతావరణ కేంద్రం
Telangana Weather Updates : తెలంగాణకు ఐఎండీ బిగ్ అలర్ట్ ఇచ్చింది. జూన 18 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.
Telangana Heavy Rains : తెలంగాణకు వాతావరణ కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది.రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు ఉండకపోయినప్పటికీ…. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది.

జూన్ 15 నుంచి జూన్ 16 (ఉదయం 08:30 వరకు)… రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిమీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
జూన్ 16 నుంచి జూన్ 17 (ఉదయం 08:30 వరకు) వరకు 30 నుంచి 40 కిమీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడవచ్చు.
ఈనెల 18 నుంచి భారీ వర్షాలు…
ఈనెల 18 నుంచి వాతావరణంలో భారీ మార్పులు రానున్నాయి. గాలుల వేగం గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో ఉంటాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జూన్ 18న రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వానలు పడే సూచనలు ఉన్నాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

