బైకర్ల ప్రాణాలను రక్షించడానికి మల్కాజ్‌గిరి పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది ఏంటంటే.. హెల్మెట్ బ్యాంక్. రైడర్లు హెల్మెట్‌ను ఉచితంగా తీసుకెళ్లవచ్చు. తెలంగాణ పోలీసుల అరైవ్ అలైవ్ ప్రచారంలో భాగంగా ఈ విధానాన్ని తీసుకువచ్చారు. ద్విచక్ర వాహనదారుల భద్రతా కోసం మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఈ 'హెల్మెట్ బ్యాంక్' చొరవను ప్రవేశపెట్టింది.

ఈ కార్యక్రమం హెల్మెట్ లేని రైడర్లు అక్కడికక్కడే హెల్మెట్‌లను అప్పుగా తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇది తక్షణం ఎలాంటి హాని కలగకుండా హెల్మెట్ పెట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. ద్విచక్ర వాహనదారు సేఫ్టీని పాటించేందుకు సాయపడుతుంది.
ఇక్కడ హెల్మెట్ తీసుకునేవారు ప్రాథమిక వివరాలను అందించి హెల్మెట్‌ను పొందిన 24 గంటల్లోపు దానిని తిరిగి ఇవ్వాలి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్-I (మల్కాజ్‌గిరి) కె.రాహుల్ రెడ్డి మాట్లాడుతూ.. కేవలం బైకర్లపై చలాన్లతో చర్యలు తీసుకోవడంపై మాత్రమే ఆధారపడకుండా బాధ్యతాయుతమైన రైడింగ్ పెంపొందించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని చెప్పారు.
పోలీసులు మొదటి రోజు 70 హెల్మెట్‌లను కొనుగోలు చేసి హెల్మెట్ లేని రైడర్లకు అప్పుగా ఇచ్చారు. బైకర్ల లైసెన్స్‌లు లేదా ఆర్సీలను తీసుకున్నారు. హెల్మెట్‌లను తిరిగి ఇచ్చిన తర్వాత వాటిని తిరిగి ఇస్తారు. గడువు 24 గంటలుగా నిర్ణయించారు. ఈ కండీషన్లతో హెల్మెట్ తీసుకెళ్లాలి. సికింద్రాబాద్‌లో అత్యధిక ట్రాఫిక్ ఉన్న సంగీత జంక్షన్ దగ్గర ఈ విధానాన్ని మెుదలుపెట్టారు. బైకర్లకు తల గాయాలు కాకుండా చూసుకోవడం, ప్రాణాలను కాపాడటం లక్ష్యంగా దీని ప్రధాన ఉద్దేశం. దూరంతో సంబంధం లేకుండా ప్రతి ప్రయాణానికి హెల్మెట్ వాడకం తప్పనిసరి అని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.
బేగంపేట పరిధిలో వారాంతంలో ఇలాంటి విధానం ప్రారంభమవుతుందని, ఆ తర్వాత మిగిలిన పోలీస్ స్టేషన్లలో కూడా ప్రారంభమవుతుందని ట్రాఫిక్ డీసీపీ 1 రాహుల్ రెడ్డి అన్నారు. దాతలు కూడా హెల్మెట్లు ఇచ్చేందుకు ముందుకు వస్తే బాగుంటుందని చెప్పారు. ఈ జోన్లో అల్వాల్, తిరుమలగిరి, బేగంపేట్, జవహర్‌నగర్, గోపాలపురం, మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిమితులు ఉన్నాయి.
{{/usCountry}}బేగంపేట పరిధిలో వారాంతంలో ఇలాంటి విధానం ప్రారంభమవుతుందని, ఆ తర్వాత మిగిలిన పోలీస్ స్టేషన్లలో కూడా ప్రారంభమవుతుందని ట్రాఫిక్ డీసీపీ 1 రాహుల్ రెడ్డి అన్నారు. దాతలు కూడా హెల్మెట్లు ఇచ్చేందుకు ముందుకు వస్తే బాగుంటుందని చెప్పారు. ఈ జోన్లో అల్వాల్, తిరుమలగిరి, బేగంపేట్, జవహర్‌నగర్, గోపాలపురం, మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిమితులు ఉన్నాయి.
{{/usCountry}}కొంత దూరమే కదా.. అని హెల్మెట్ లేకుండా వచ్చిన వారికి కూడా పోలీసులు హెల్మెట్ బ్యాంక్ నుంచి అందించారు. ఆహారం కొనడానికి వచ్చానని చెప్పిన బైకర్‌కు హెల్మెట్ అందించారు. దీనిపై చాలా మంది బైకర్లు సానుకూలంగా ఉన్నారు. తాము పోలీసులకు హెల్మెట్ లేనప్పుడు వివిధ కారణాలను చెబుతామని, కానీ ఈ కార్యక్రమం హెల్మెట్లు ధరించడం ప్రాముఖ్యతను అర్థమయ్యేలా చేస్తుందన్నారు. పోలీసులు దగ్గర ఉన్న బైకర్ల లైసెన్స్, ఆర్సీలతో హెల్మెట్లు తిరిగి కచ్చితంగా ఇస్తారని చెబుతున్నారు.