ఈ ప్రాంతంలో హెల్మెట్ బ్యాంక్.. ఫ్రీగా హెల్మెట్ తీసుకోవచ్చు.. కానీ కొన్ని కండీషన్లు

బైకర్లలో హెల్మెట్ వాడకాన్ని ప్రోత్సహించడానికి, వారి ప్రాణాలను రక్షించేందుకు మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ హెల్మెట్ బ్యాంక్‌ను ప్రారంభించింది. హెల్మెట్ లేని రైడర్లు ఉచితంగా తీసుకోవచ్చు. అయితే ఇందుకోసం కొన్ని కండీషన్లు ఉన్నాయి.

Published on: Feb 24, 2026, 10:02:16 IST
By , Malkajgiri
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బైకర్ల ప్రాణాలను రక్షించడానికి మల్కాజ్‌గిరి పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది ఏంటంటే.. హెల్మెట్ బ్యాంక్. రైడర్లు హెల్మెట్‌ను ఉచితంగా తీసుకెళ్లవచ్చు. తెలంగాణ పోలీసుల అరైవ్ అలైవ్ ప్రచారంలో భాగంగా ఈ విధానాన్ని తీసుకువచ్చారు. ద్విచక్ర వాహనదారుల భద్రతా కోసం మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఈ 'హెల్మెట్ బ్యాంక్' చొరవను ప్రవేశపెట్టింది.

మల్కాజ్‌గిరిలో హెల్మెట్ బ్యాంక్ (malkajgiri police)
మల్కాజ్‌గిరిలో హెల్మెట్ బ్యాంక్ (malkajgiri police)

ఈ కార్యక్రమం హెల్మెట్ లేని రైడర్లు అక్కడికక్కడే హెల్మెట్‌లను అప్పుగా తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇది తక్షణం ఎలాంటి హాని కలగకుండా హెల్మెట్ పెట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. ద్విచక్ర వాహనదారు సేఫ్టీని పాటించేందుకు సాయపడుతుంది.

ఇక్కడ హెల్మెట్ తీసుకునేవారు ప్రాథమిక వివరాలను అందించి హెల్మెట్‌ను పొందిన 24 గంటల్లోపు దానిని తిరిగి ఇవ్వాలి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్-I (మల్కాజ్‌గిరి) కె.రాహుల్ రెడ్డి మాట్లాడుతూ.. కేవలం బైకర్లపై చలాన్లతో చర్యలు తీసుకోవడంపై మాత్రమే ఆధారపడకుండా బాధ్యతాయుతమైన రైడింగ్ పెంపొందించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని చెప్పారు.

పోలీసులు మొదటి రోజు 70 హెల్మెట్‌లను కొనుగోలు చేసి హెల్మెట్ లేని రైడర్లకు అప్పుగా ఇచ్చారు. బైకర్ల లైసెన్స్‌లు లేదా ఆర్సీలను తీసుకున్నారు. హెల్మెట్‌లను తిరిగి ఇచ్చిన తర్వాత వాటిని తిరిగి ఇస్తారు. గడువు 24 గంటలుగా నిర్ణయించారు. ఈ కండీషన్లతో హెల్మెట్ తీసుకెళ్లాలి. సికింద్రాబాద్‌లో అత్యధిక ట్రాఫిక్ ఉన్న సంగీత జంక్షన్‌ దగ్గర ఈ విధానాన్ని మెుదలుపెట్టారు. బైకర్లకు తల గాయాలు కాకుండా చూసుకోవడం, ప్రాణాలను కాపాడటం లక్ష్యంగా దీని ప్రధాన ఉద్దేశం. దూరంతో సంబంధం లేకుండా ప్రతి ప్రయాణానికి హెల్మెట్ వాడకం తప్పనిసరి అని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.

బేగంపేట పరిధిలో వారాంతంలో ఇలాంటి విధానం ప్రారంభమవుతుందని, ఆ తర్వాత మిగిలిన పోలీస్ స్టేషన్లలో కూడా ప్రారంభమవుతుందని ట్రాఫిక్ డీసీపీ 1 రాహుల్ రెడ్డి అన్నారు. దాతలు కూడా హెల్మెట్‌లు ఇచ్చేందుకు ముందుకు వస్తే బాగుంటుందని చెప్పారు. ఈ జోన్‌లో అల్వాల్, తిరుమలగిరి, బేగంపేట్, జవహర్‌నగర్, గోపాలపురం, మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిమితులు ఉన్నాయి.

కొంత దూరమే కదా.. అని హెల్మెట్ లేకుండా వచ్చిన వారికి కూడా పోలీసులు హెల్మెట్ బ్యాంక్ నుంచి అందించారు. ఆహారం కొనడానికి వచ్చానని చెప్పిన బైకర్‌కు హెల్మెట్ అందించారు. దీనిపై చాలా మంది బైకర్లు సానుకూలంగా ఉన్నారు. తాము పోలీసులకు హెల్మెట్ లేనప్పుడు వివిధ కారణాలను చెబుతామని, కానీ ఈ కార్యక్రమం హెల్మెట్లు ధరించడం ప్రాముఖ్యతను అర్థమయ్యేలా చేస్తుందన్నారు. పోలీసులు దగ్గర ఉన్న బైకర్ల లైసెన్స్, ఆర్సీలతో హెల్మెట్లు తిరిగి కచ్చితంగా ఇస్తారని చెబుతున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More