తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్ట్) పాలసీని ఆమోదిస్తూ అధికారిక ఉత్తర్వు జారీ చేసింది. దీని ద్వారా ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల, చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక భూములను బహుళ వినియోగ జోన్లుగా అధికారికంగా మార్చడానికి వీలు కల్పిస్తుంది. హైదరాబాద్ సిటీ లోపల ఉన్న కాలుష్యకారక, ఔట్‌డేటెడ్ టెక్నాలజీతో నడుస్తున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలిస్తారు.

ఈ హిల్ట్ పాలసీలో భాగంగా 22 ఇండస్ట్రీయల్ ఏరియాల్లోని 9,292 ఎకరాల భూములను ఇతర అవసరాలకు వాడుకునేలా అవకాశం ఉంటుంది. ఈ భూముల్లో 4,740 ఎకరాలు ప్లాటెడ్ అంటే నిర్మాణాలు చేపట్టినవి. వన్-టైమ్ డెవలప్‌మెంట్ ఇంపాక్ట్ ఫీజు (డీఐఎఫ్) చెల్లింపుల గురించి కూడా నోటీసులో తెలిపారు.
80 ఫీట్ల కంటే తక్కువ రోడ్లు ఉన్న ప్లాట్లకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు విలువపై 30 శాతం ఇంపాక్ట్ ఫీజు నిర్ణయించారు. అయితే 80 అడుగులు, అంతకంటే ఎక్కువ రోడ్లను ఎదుర్కొంటున్నవి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు విలువలో 50 శాతం చెల్లించాలి. దరఖాస్తుదారులు TG-IPASSలో ఆన్‌లైన్ సమర్పణ సమయంలో 20 శాతం ముందస్తుగా చెల్లించాలి. మిగిలిన 80 శాతం రెండు వాయిదాలలో 45 రోజుల్లోపు క్లియర్ చేయాలి. ఒక నెల గ్రేస్ పీరియడ్ తర్వాత 1 శాతం నెలవారీ జరిమానా వర్తిస్తుంది. ఆ తర్వాత రుసుము జప్తు చేస్తారు, దరఖాస్తుదారు అనర్హుడు అవుతాడు.
TGIIIC/IALA 7 రోజుల్లోపు ప్రాథమిక పరిశీలనను పూర్తి చేస్తాయి. మరో 7 రోజుల్లో తుది ఆమోదం లభిస్తుంది. ఆరు నెలల గడువు నిబంధనను నిర్దేశించారు. అన్ని దరఖాస్తులను ఆ గడువులోపు దాఖలు చేయాలని నిబంధన విధించారు. కొత్త విధానం ప్రకారం దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి, లేఅవుట్ సవరణలను పర్యవేక్షించడానికి TGIIIC నోడల్ ఏజెన్సీగా నియమించారు.
గతంలో పరిశ్రమల కోసం భూమలు కేటాయించారు. అయితే కొన్ని దశాబ్దాల్లో సిటీ ఎంతగానో అభివృద్ధి అయింది. ఒకప్పుడు సిటీ అవతల అనుకున్న ప్రాంతాలు ఇప్పుడు సిటీకి ముఖ్యమైన ఏరియాలుగా అయ్యాయి. అప్పుడు ఏర్పాటు అయిన పరిశ్రమలు ప్రస్తుతం కాలుష్య కారకాలుగా మారాయి. గతంలోనే ప్రభుత్వం ఇలాంటి పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలిస్తామని తెలిపింది. ఆ భూములను వేరే రకంగా ఉపయోగిస్తామని వెల్లడించింది. అందులో భాగంగా తాజాగా చర్యలు తీసుకుంది.
{{/usCountry}}గతంలో పరిశ్రమల కోసం భూమలు కేటాయించారు. అయితే కొన్ని దశాబ్దాల్లో సిటీ ఎంతగానో అభివృద్ధి అయింది. ఒకప్పుడు సిటీ అవతల అనుకున్న ప్రాంతాలు ఇప్పుడు సిటీకి ముఖ్యమైన ఏరియాలుగా అయ్యాయి. అప్పుడు ఏర్పాటు అయిన పరిశ్రమలు ప్రస్తుతం కాలుష్య కారకాలుగా మారాయి. గతంలోనే ప్రభుత్వం ఇలాంటి పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలిస్తామని తెలిపింది. ఆ భూములను వేరే రకంగా ఉపయోగిస్తామని వెల్లడించింది. అందులో భాగంగా తాజాగా చర్యలు తీసుకుంది.
{{/usCountry}}