హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడి భగభగలకు తోడు భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో నగరంలో తాగునీటి డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడు నీటి వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు.
నగరంలోని పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన ఆయన…. క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ టైమ్ తదితర వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ వేసవిలో గత ఏడాది కంటే ఓవరాల్ గా ట్యాంకర్ బుకింగ్ పెరగకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లోని ఫిల్లింగ్ స్టేషన్ లలో గత ఏడాదికంటే బుకింగ్ పెరిగిందని చెప్పారు.
గత ఏడాది కంటే మణికొండ, బంజారాహిల్స్, డోయెన్స్, హఫీజ్ పేట్, నేతాజీ పార్క్ ఫిల్లింగ్ స్టేషన్లో బుకింగ్స్ పెరిగినట్టు వెల్లడించారు. ఈ పెండెన్సీని తగ్గించుకోవడానికి.. ఈ రెండు రోజుల్లో సున్నానికి తగ్గించుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఫిల్లింగ్ స్టేషన్లో నీటి సరఫరా సరఫరాలను, సరఫరా సమయాన్ని పెంచడం, డిమాండ్ తక్కువ ట్యాంకర్ బుకింగ్ నమోదు అవుతున్న ఫిల్లింగ్ స్టేషన్ నుంచి అధికంగా డిమాండ్ ని డెలివరీ చేసేలాగా ప్రత్యేక ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు.
రాత్రి వేళల్లో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయడంతో.. పెండెన్సీ బాగా తగ్గించుకున్నామని తెలిపారు. అవసరమైతే నైట్ షిఫ్ట్ లో పనిచేసే వారికి ప్రత్యేక అలవెన్స్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో కమర్షియల్ వినియోగదారులకు టాంకర్లను సరఫరా చేయడానికి ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాగే ప్రత్యేక దృష్టి పెడితే బుక్ చేసిన 12 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేసే వీలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నగరంలోని ప్రతి కుటుంబం కనీసం 20 శాతం వరకు నీటిని ఆదా చేయాలని సూచించారు. చిన్నచిన్న అలవాట్ల మార్పులతోనే పెద్ద మొత్తంలో నీటిని సంరక్షించవచ్చని ఆయన పేర్కొన్నారు.
పౌరులకు ముఖ్య సూచనలు:
- విలువైన తాగునీటిని వాహనాల శుభ్రపరిచేందుకు… ఇళ్ల పరిసరాలను కడగడానికి ఉపయోగించరాదు.
- బ్రష్ చేసేటప్పుడు నల్లా (ట్యాప్) నిరంతరం తెరిచి ఉంచకుండా, మగ్గులో నీరు తీసుకుని వినియోగించాలి.
- స్నానం చేసేటప్పుడు షవర్ వినియోగాన్ని తగ్గించి, బకెట్ నీటితో స్నానం చేయడం ద్వారా గణనీయంగా నీటిని ఆదా చేయవచ్చు.
- లీకేజీలు ఉన్న పైపులు, ట్యాపులు వెంటనే మరమ్మతులు చేయించుకోవాలి.
- అవసరానికి మించి నీటిని నిల్వ చేయడం, వృథా చేయడం నివారించాలి.

జలమండలి ఇప్పటికే వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతోందని ఎండీ తెలిపారు. అయినప్పటికీ… వేసవిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రజల సహకారం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.