వాటర్ బిల్లు కట్టలేదా? కనెక్షన్ కట్ అవుతుందంటూ మెసేజ్ వచ్చిందా? హెచ్చరిక!

హైదరాబాద్‌లో వాటర్ బిల్లుల పేరిట సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపారు. మీటర్ అప్‌డేట్, వెరిఫికేషన్ అంటూ లక్షలు దోచుకుంటున్నారు.

Published on: Jun 6, 2026, 11:27:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నగరవాసులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. ఈసారి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) పేరుతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. ఈ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ టి. సాయి మనోహర్ హెచ్చరించారు.

హైదరాబాద్ వాటర్ బోర్డు
హైదరాబాద్ వాటర్ బోర్డు

సైబర్ నేరగాళ్లు వినియోగదారుల మొబైల్ ఫోన్లకు వాట్సాప్ మెసేజ్‌లు, ఎస్ఎమ్ఎస్‌లు పంపడం లేదా నేరుగా ఫోన్ కాల్స్ చేస్తున్నారు. 'మీ వాటర్ బిల్లు అప్‌డేట్ కాలేదు, మీ మీటర్ రీడింగ్ నమోదు కాలేదు, లేదా మీ 'క్యాన్' (CAN - Consumer Account Number) వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉంది.' అంటూ నమ్మిస్తారు.

నిబంధనల ప్రకారం వెంటనే వివరాలు అప్‌డేట్ చేయకపోతే వాటర్ కనెక్షన్ కట్ చేస్తామని బెదిరింపులకు దిగుతారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే తాము పంపే లింక్ ద్వారా APK ఫైల్స్ లేదా క్విక్ సపోర్ట్ (Kwik Support) వంటి రిమోట్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తారు.

నమ్మకం కుదిరించడం కోసం కేవలం రూ.10, రూ.13 లేదా రూ.20 రూపాయలు మాత్రమే ఆన్‌లైన్‌లో కట్టాలని నేరగాళ్లు చెబుతారు. వినియోగదారులు ఆ రిమోట్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయగానే, వారి ఫోన్ స్క్రీన్ బ్లాంక్ అయిపోవడం లేదా హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నేరగాళ్లు బాధితుల ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటారు.

మరికొందరిని వీడియో కాల్స్ ద్వారా తప్పుదోవ పట్టిస్తూ, వారి యూపీఐ, బ్యాంకింగ్ యాప్స్‌లో తాము చెప్పినట్లు చేయాలని సూచిస్తారు. వారు చెప్పినట్లు చేయగానే క్షణాల వ్యవధిలో బాధితుల బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డుల నుండి లక్షలాది రూపాయలు మాయమవుతున్నాయని డీసీపీ వెల్లడించారు.

వాటర్ బోర్డు అధికారుల పేరిట వచ్చే ఇలాంటి మోసపూరితమైన మెసేజ్‌ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోండి. వాటర్ బిల్లులు చెల్లించడానికి లేదా స్టేటస్ తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ HMWSSB అధికారిక వెబ్‌సైట్ లేదా 'My HMWSSB' మొబైల్ యాప్‌ను మాత్రమే ఉపయోగించండి.

వాట్సాప్ లేదా ఎస్ఎమ్ఎస్ ద్వారా వచ్చే ఎలాంటి ఏపికె (.apk) ఫైల్స్ ఇన్స్టాల్ చేయవద్దు. ఇవి మీ ఫోన్ డేటాను దొంగిలించే మాల్వేర్లు. వాటర్ బోర్డు సిబ్బంది ఎన్నడూ మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీ, ఏటీఎం పిన్ లేదా క్రెడిట్ కార్డ్ వెనుక ఉండే సివివి నంబర్లను అడగరని గుర్తుంచుకోండి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా ఏ అధికారీ వాటర్ కనెక్షన్‌ను రాత్రికి రాత్రే తొలగించలేరు. కాబట్టి కంగారు పడి నిర్ణయాలు తీసుకోవద్దు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More